- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మనుషులే కాదు, తేనెటీగలు కూడా వాటిని గుర్తించగలవు..?!
దిశ, వెబ్‌డెస్క్ః సృష్టిలో ఉత్తమ జన్మ, పోనీ.. అత్యంత తెలివిగల జీవి, మనుషులేనని అనుకుంటాము. కావచ్చు గాక, పక్షి నుండి విమానాన్ని, జంతువుల నుండి ఇల్లు గట్రా వంటి చాలా విషయాలు నిజానికి మనిషి పశువుల నుండి నేర్చుకున్నవే. ఇలాగే, మనిషి జిమ్మిక్కులు చేసే మ్యాథ్స్ జ్ఞానం మనకే సొంతం అనుకోవడం కూడా పొరపాటే. ఎందుకంటే, సరళమైన సరి, బేసి సంఖ్యల గురించి మనకు తెలుసు. 2 తో భాగించబడే సంఖ్యలను సరి సంఖ్యలు (2,4,6,...) అని, మిగిలిన వాటిని బేసి సంఖ్యలు (1,3,5,7,....) అంటారని మనకు తెలుసు. అయితే, ఈ సరి, బేసి సంఖ్యల మధ్య తేడాను (పారిటీ అసోసియేషన్) నేర్చుకోవాలంటే మాత్రం స్పష్టంగా చాలా ఎక్కువ గణిత సామర్థ్యం అవసరమవుతుంది.
సంఖ్యలను బేసి, సరి అని వర్గీకరించేటప్పుడు మనిషి ఖచ్చితత్వం, వేగం, భాష, ప్రాదేశిక సంబంధాల పక్షపాతాన్ని ప్రదర్శిచాలి. సరి సంఖ్యలను కుడిచేత్తో, ఎడమచేత్తో బేసి సంఖ్యలను అనుబంధించడంలో మనిషికి సహజసిద్ధమైన సామర్థ్యం ఉంటుంది. కానీ తేనెటీగలు మాత్రం సరి, బేసి సంఖ్యల మధ్య తేడాను గుర్తించడంతో పాటు ఈ సామర్థ్యాన్ని దేనితోనైనా అనుబంధించడం ద్వారా చేయగలవని ఇటీవల కనుక్కున్నారు. ఫ్రాంటియర్స్ ఇన్ ఎకాలజీ అండ్ ఎవల్యూషన్‌లో ప్రచురించబడిన ఈ పరిశోధనలో ఈ విషయాన్ని వెల్లడించారు.
ఈ ప్రయోగంలో, శాస్త్రవేత్తలు తేనెటీగలను రెండు గ్రూపులుగా విభజించారు. తేనెటీగల సమూహంలో సరి సంఖ్యలను చక్కెర నీటితో, బేసి సంఖ్యను క్వినైన్ అనే చేదు పరీక్ష ద్రవంతో అనుబంధించడం నేర్పించారు. రెండవ సమూహానికి బేసి సంఖ్యలను చక్కెర నీటితో, సరి సంఖ్యలను క్వినైన్‌తో అనుబంధించడం నేర్పించారు. ఆ తర్వాత తేనెటీగల సమూహాలకు బేసి, సరి సంఖ్యలు (1-10) ఆకృతుల సంఖ్యను ఉపయోగించడం ద్వారా వీటికి ఆ సామర్థ్యం ఉందని తెలిసింది. బేసి సంఖ్యలను అనుబంధించడం నేర్పిన తేనెటీగల సమూహం ఇతర సమూహం కంటే త్వరగా నేర్చుకుందని కనుక్కున్నారు. అందువల్ల, నేర్చుకోవడంలో ఉండే పక్షపాతం మానవులకు విరుద్ధంగా ఉన్నట్లు ఇందులో తెలిసింది.