- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హిజ్బుల్లా టాప్ లీడర్ సఫియుద్దీన్ హతం
దిశ, నేషనల్ బ్యూరో: ఇరాన్ మద్దతుగా ఉండే లెబనాన్‌లోని ఉగ్రసంస్థ హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లాను ఇది వరకే ఇజ్రాయెల్ చంపేసింది. ఆయన తర్వాత హిజ్బుల్లాకు సారథ్యం వహించే స్థానంలో హషీం సఫీయుద్దీన్ ఉన్నారు. కానీ, సఫీయుద్దీన్‌ను కూడా మట్టుబెట్టినట్టు ఇజ్రాయెల్ మంగళవారం వెల్లడించింది. తాజాగా హిజ్బుల్లా కూడా సఫీయుద్దీన్ మరణాన్ని ధ్రువీకరించింది. దశాబ్దాలుగా హిజ్బుల్లాలో కొనసాగిన సఫీయుద్దీన్ అనతి కాలంలోనే ఉన్నత స్థానాలకు ఎదిగారు. హసన్ నస్రలాకు సఫీయుద్దీన్ దగ్గరి బంధువు. హిజ్బుల్లా సభ్యులను ఉత్తేజితం చేయడంలో, ఉద్రేకపరచడంలో సఫీయుద్దీన్‌ది అందెవేసిన చేయి అని చెబుతారు. ఆయన ప్రసంగాలు అంత పవర్‌ఫుల్‌గా ఉంటాయని తెలుస్తున్నది. ఎంతటి మూల్యం చెల్లించైనా ఇజ్రాయెల్‌పై హిజ్బుల్లా తన పోరాటాన్ని కొనసాగిస్తూనే ఉంటుందని ఇది వరకే వెల్లడించారు. తాజాగా, ఆయనే మరణించాడు.
హిజ్బుల్లాలో సఫీయుద్దీన్‌కు మంచి ఆదరణ ఉన్నది. హిజ్బుల్లాలో సెకండ్ టాప్ మోస్ట్ లీడర్‌గా ఆయనే ఉన్నాడు. నస్రల్లా మరణంతో హిజ్బుల్లా బాధ్యతలను సఫీయుద్దీన్ తీసుకుంటాడని దాదాపు అందరూ అనుకున్నారు. లెబనాన్‌లోనూ ఎక్కువ మందికి తెలిసిన ముఖం. ఇరాన్‌తో దగ్గరి సంబంధాలు నెరపిన సఫీయుద్దీన్.. హిజ్బుల్లాకు సంబంధించి నిర్ణయాలు తీసుకునే ముఖ్యమైన షురా బాడీలో, దాని జిహాద్ కౌన్సిల్‌లో సభ్యుడిగా ఉన్నారు. అలాగే.. పాఠశాలలు, సామాజిక కార్యక్రమాలు చేపట్టే ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ బాధ్యతలు ఆయనే చేపట్టాడు.
గాజాలో పోలియో వ్యాక్సినేషన్ వాయిదా
ఉత్తర గాజాలో పోలియో వ్యాక్సినేషన్ సాధ్యం కాదని, ఇజ్రాయెల్ భీకర దాడుల కారణంగా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని వాయిదా వేసినట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ బుధవారం తెలిపింది. టైప్ 2 పోలియోతో ఓ బేబీ పాక్షికంగా పక్షవాతానికి గురైనట్టు ఆగస్టులో గుర్తించిన డబ్ల్యూహెచ్‌వో సెప్టెంబర్ 1వ తేదీన పోలియో క్యాంపెయిన్ మొదలుపెట్టింది. చివరి విడత పోలింగ్ వ్యాక్సినేషన్ బుధవారం ప్రారంభం కావాల్సింది. పోలియో టీకా చివరి ఫేజ్‌లో భాగంగా 119,000 మంది పాలస్తీనా పిల్లలకు టీకా వేయాలని సంకల్పించింది. కానీ, ఇజ్రాయెల్ దాడులతో ప్రజలు తమ పిల్లలను పట్టుకుని టీకా కేంద్రాలకు వచ్చే పరిస్థితులు లేవని, అలాగే.. హెల్త్ వర్కర్లు టీకాలు వేయడం కూడా ఇబ్బందికరంగా మారిందని వివరించింది.