- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చైనాలో గందరగోళం: కరోనా క్వారంటైన్‌కి భయపడి పరిగెత్తిన జనం! (వీడియో)
దిశ, వెబ్‌డెస్క్ః మూడేళ్లు దాటుతున్నా కరోనా భయం ప్రపంచాన్ని వీడి పోలేదు. ముఖ్యంగా, వైరస్ వ్యాప్తికి కారణమైన చైనాను కరోనా ఇప్పటికీ తీవ్రంగానే పట్టి పీడిస్తోంది. తాజాగా, చైనా ఆర్థిక నగరం షాంఘైలో గందరగోళ పరిస్థితి నెలకొంది. షాంఘైలోని ఐకియా స్టోర్‌లో శనివారం చోటుచేసుకున్న గందరగోళ దృశ్యాలు కలవరపెడుతన్నాయి. స్టోర్‌లో ఒక కస్టమర్‌కు కోవిడ్ పాజిటివ్ లక్షణాలు కనబడటంతో, ఆరోగ్య అధికారులు జుహుయ్ జిల్లాలో ఉన్న ఈ స్టోర్‌ని చుట్టుముట్టారు. దుకాణాన్ని లాక్ చేయడానికి ప్రయత్నించారు. ఇందులో భాగంగా, అధికారులు దుకాణదారుల్ని, కస్టమర్లను.. ఎవ్వర్నీ బయటకి రాకుండా నిర్బంధించడానికి ప్రయత్నించడంతో ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి. వారిని ఎక్కడ క్వారెంటైను పంపిస్తారోననే భయంతో అంతా తప్పించుకోవడానికి ప్రయత్నించారు. తలుపు నెట్టుకుంటూ, అధికారుల్ని కూడా తోసుకుంటూ జనాలు పరుగులు పెట్టారు.
ఈ సంఘటనకు సంబంధించిన అనేక వీడియోలు చైనాలోని ట్విట్టర్ లాంటి ప్లాట్‌ఫారమ్ వీబోలో షేర్ చేయగా, నెటిజన్లు ఆ దేశంలో ఆచరిస్తున్న కఠినమైన "జీరో-కోవిడ్" వ్యూహంపై మండిపడ్డారు. ఈ సంవత్సరం ప్రారంభంలో రెండు నెలల తీవ్రమైన లాక్‌డౌన్‌ను పెట్టిన ప్రభుత్వం, ఎక్కడైనా పాజిటీవ్ కేసులు లేదంటే, వారి సన్నిహిత పరిచయాలను గుర్తిస్తే, ఆ ప్రాంతాలను ఫ్లాష్ లాక్‌డౌన్ చేయాలని ఆదేశించింది. ఈ క్రమంలో టిబెట్‌లోని లాసాను సందర్శించిన ఆరేళ్ల బాలుడికి కోవిడ్ పాజిటీవ్ ఉన్న వ్యక్తితో సన్నిహిత సంబంధం ఉందని తెలిసిన తర్వాత, ఆ పిల్లాడు ఐకియా స్టోర్‌లో ఉన్నాడని తెలిసి, ఐకియాను ఆకస్మికంగా మూసివేయాలని ఆదేశించినట్లు షాంఘై హెల్త్ కమిషన్ డిప్యూటీ డైరెక్టర్ జావో దండన్ ఆదివారం చెప్పారు. జావో ఆదేశాల మేరకు, Ikea స్టోర్, సంబంధిత ప్రాంతాల్లో ఉన్నవారు తప్పనిసరిగా రెండు రోజులు నిర్బంధంలో ఉండాలి. తర్వాత ఐదు రోజుల ఆరోగ్య పర్యవేక్షణ ఉండాలని నివేదించారు. షాంఘై డైలీ నివేదించిన ప్రకారం, ఆరేళ్ల బాలుడితో దాదాపు 400 మంది సన్నిహితులు PCR పరీక్ష చేయించుకోవాలని ఆదేశించారు.
కూతురి పెళ్లికి తల్లికి మేకప్.. అసలు సంగతి తెలిస్తే షాక్! (వీడియో)