- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హమాస్ అగ్రనేతపై ఇజ్రాయెల్ గురి.. దక్షిణ గాజాను జల్లెడపడుతున్న ఆర్మీ
గాజా: ఉత్తర గాజాపై పట్టు సాధించిన ఇజ్రాయెల్ ఆర్మీ.. దక్షిణ గాజాలోని హమాస్ స్థావరాలన్నీ ధ్వంసం చేసే దిశగా అడుగులు వేస్తోంది. ఈక్రమంలో దక్షిణ గాజాలో ఒక కీలక హమాస్ అగ్రనాయకుడి కోసం జల్లెడ పడుతోంది. అతడే యాహ్యా సిన్వార్. యాహ్యా సిన్వార్ దక్షిణ గాజాలోని ఒక రహస్య సొరంగంలో ఉంటూ హమాస్‌కు డైరెక్షన్స్ ఇస్తున్నాడని ఇజ్రాయెల్ ఆర్మీ అనుమానిస్తోంది.
ఇటీవల ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహూ ప్రసంగిస్తూ.. ‘‘యాహ్యా సిన్వార్ చిన్న హిట్లర్ లాంటి వాడు.. గాజాలోనే ఉండి ఉంటే అతడు చచ్చిన వాడితో సమానం. అతన్ని వదిలేది లేదు’’ అని అల్టిమేటం ఇచ్చారు. హమాస్ సహా గాజాలోని అన్ని మిలిటెంట్ సంస్థలను కలిపి అక్టోబరు 7న ఇజ్రాయెల్‌పై దాడి చేయించింది అతడే అని నెతన్యాహు ఆరోపిస్తున్నారు.
వాస్తవానికి 2000వ దశకం ప్రారంభంలో ఇజ్రాయెల్ జైలులో ఉన్నప్పుడే సిన్వార్ తలనొప్పి, అస్పష్టమైన దృష్టి వంటి సమస్యలను ఎదుర్కొనేవాడు. అక్కడే అతడికి బ్రెయిన్ ట్యూమర్ సర్జరీ కూడా జరిగింది. ఖైదీలు, బందీల మార్పిడి ఒప్పందంలో భాగంగా ఇజ్రాయెల్ జైలు నుంచి విడుదలయ్యాక సిన్వార్ హమాస్‌లో మళ్లీ యాక్టివ్ అయ్యాడు. ఇప్పుడు అతడి ఆరోగ్యం మరింత ప్రతికూలంగా మారి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.
- Tags
- Israel-Hamas