- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
రెడ్ నోటీస్ ఓకే.. మరి బ్లూ ఏంటి..? ఇంటర్ పోల్ నోటీసుల పూర్తి వివరాలు ఇవే
దిశ, వెబ్‌డెస్క్: ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్‌రావుపై ఇంటర్ పోల్ రెడ్ కార్నర్, బ్లూ నోటీస్ జారీ చేసింది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న ప్రభాకర్‌రావు అమెరికాలో తలదాచుకోవడంతో ప్రభుత్వం ఇంటర్‌పోల్‌ను ఆశ్రయించాల్సి వచ్చింది. అయితే, రెడ్‌కార్నర్ నోటీసు అంటే తెలుసు కానీ, మరి బ్లూ నోటీస్ ఏంటి? ఇంతకీ ఇంటర్పోల్అంటే ఏమిటో ఒకసారి చూద్దామా..?
ఇంటర్నేషన్ క్రిమినల్ పోలీస్ ఆర్గనైజేషన్
విదేశాలకు పారిపోయిన నిందితులను పట్టుకునేందుకు వివిధ దేశాల అభ్యర్థనల మేరకు ఇంటర్‌పోల్ సంస్థ పలు నోటీసులు జారీ చేస్తుంది. ఐక్యరాజ్యసమితికి అనుబంధంగా ఉండే ఈ సంస్థలో 196 సభ్యదేశాలు ఉన్నాయి. ఇంటర్నేషన్క్రిమినల్పోలీస్ఆర్గనైజేషన్ను షార్ట్ఫార్మ్లో ఇంటర్పోల్అని పిలుస్తారు. రకరకాల నేరాలు చేసి విదేశాలకు పారిపోయిన నేరస్తులను తిరిగి దేశానికి రప్పించేందుకు సభ్యదేశాలు ఈ సంస్థ సహాయం తీసుకుంటాయి. ఆయా నేరాల తీవ్రతను బట్టి ఇంటర్‌పోల్ రంగులు కేటాయించింది. నిందితులపై ఆ రంగు పేరిట నోటీసు జారీ చేస్తారు. చాలామందికి రెడ్కార్నర్నోటీసు తెలుసు. కానీ, ఇందులో మరికొన్ని రంగులు కూడా ఉంటాయి. అవేంటో ఒకసారి చూద్దాం.
రంగులు.. నోటీసులు
రెడ్ నోటీస్: స్వదేశం కానీ ఏదైనా దేశంలో నేరం చేసి మరో దేశానికి పారిపోయిన వ్యక్తులపై ఈ నోటీస్ జారీ చేస్తారు. తలదాచుకున్న దేశం అతడిని అరెస్ట్‌చేసి ఇంటర్పోల్మార్గదర్శకాలకు అనుగుణంగా నేరం చేసిన దేశానికి అప్పగించాల్సి ఉంటుంది.
ఎల్లో నోటీస్: పిల్లలు కానీ, గల్లంతైన వ్యక్తులను వెతకడం.. తప్పిపోయిన వ్యక్తులకు విషయంలో ఈ నోటీసు జారీ చేస్తారు.
బ్లూ నోటీస్: ఏదైనా దేశం ఒక వ్యక్తికి సంబంధించిన సమాచారాన్ని కోరినప్పుడు ఈ నోటీస్ జారీ చేస్తారు. సదరు వ్యక్తి దాగి ఉన్న చిరునామాతో పాటు అక్కడ చేస్తున్న పనులకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు.
బ్లాక్ నోటీస్: గుర్తుతెలియని మృతదేహాలకు సంబంధించిన సమాచారం కోరేందుకు ఈ నోటీస్‌జారీ చేస్తారు.
గ్రీన్ నోటీస్: నేరచరిత్ర ఉన్న వ్యక్తి గురించి ముందస్తుగా సమాచారం ఇచ్చేందుకు ఈ నోటీస్ఇస్తారు. ప్రజల ప్రాణాలకు అతడు ముప్పుగా మారే ప్రమాదం ఉన్న సందర్భంలో దీనిని వినియోగిస్తారు.
ఆరెంజ్నోటీస్: ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారేందుకు అవకాశం ఉన్న వేడుకలు గానీ, వ్యక్తులు, వస్తువులు ఏదైనా దేశంలోకి ప్రవేశించినప్పుడు ఈ నోటీస్‌జారీ చేస్తారు. తక్షణమే ఆ వేడుకలు నిలిపివేయాలని, అతడు లేదా వస్తువును అదుపులోకి తీసుకోవాలని హెచ్చరించేందుకు వాడతారు.
పర్పుల్నోటీస్: నేరం చేసే తీరు (మోడస్ ఆపరాండీ), ప్రజల ప్రాణాలకు ముప్పు తెచ్చే ప్రమాదకర వస్తువుల గురించిన సమాచారాన్ని అందించే సమయాల్లో ఈ నోటీస్ ఇష్యూ చేస్తారు.