టిక్‌టాక్‌లో జాయిన్ అయిన ట్రంప్

by Harish |
టిక్‌టాక్‌లో జాయిన్ అయిన ట్రంప్
X

దిశ, నేషనల్ బ్యూరో: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రముఖ వీడియో యాప్ టిక్‌టాక్‌లో జాయిన్ అయ్యారు. అంతకుముందు ఆయన అధ్యక్షుడిగా ఉన్న సమయంలో 2020లో టిక్‌టాక్‌ను నిషేధించాలని చూడగా, కోర్టు తన ప్రయత్నాలను అడ్డుకుంది. అయితే ఇప్పుడు తాజాగా దానిలో చేరడం గమనార్హం. ఆయన ఖాతా నుంచి శనివారం సాయంత్రం ఒక వీడియో వచ్చింది. న్యూజెర్సీలోని నెవార్క్‌లో జరిగిన అల్టిమేట్ ఫైటింగ్ ఛాంపియన్‌షిప్ ఫైట్‌లో ట్రంప్ అభిమానులను పలకరిస్తున్నట్లు వీడియోలో కనిపించింది. @realdonaldtrump పేరుతో అధ్యక్షుడు డొనాల్డ్ ఖాతా 4,50,000 కంటే ఎక్కువ మంది ఫాలోవర్స్‌ను కలిగి ఉంది.

ఇదిలా ఉంటే టిక్‌టాక్‌ను నిషేధించాలని అమెరికా చట్ట సభ సభ్యులు ఇంతకుముందు ఆమోదం తెలపగా, దీనిని సవాలు చేస్తూ చైనాకు చెందిన దాని మాతృ సంస్థ ByteDance కోర్టుల్లో పిటిషన్ దాఖలు చేసింది. జాతీయ భద్రత కారణాల రీత్యా చైనీస్ ఆధారిత యాప్‌ను దేశం నుంచి నిషేధించాలని ప్రభుత్వం చూస్తుంది. అమెరికా సమాచారాన్ని టిక్‌టాక్ చైనాకు అందిస్తుందని చట్టసభ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఇదే సమయంలో టిక్‌టాక్, అమెరికా సమాచారాన్ని చైనా ప్రభుత్వానికి అందించడం లేదని వినియోగదారుల గోప్యతను రక్షించడానికి గణనీయమైన చర్యలు తీసుకున్నామని వాదించింది.

Advertisement

Next Story

Most Viewed