బంగ్లాదేశ్‌లో అమెరికా వైమానిక స్థావరం ?

by Hajipasha |
బంగ్లాదేశ్‌లో అమెరికా వైమానిక స్థావరం ?
X

దిశ, నేషనల్ బ్యూరో : బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనా సంచలన వివరాలను వెల్లడించారు. బంగ్లాదేశ్, మయన్మార్ బార్డర్‌లోని కొన్ని ప్రాంతాలను కలుపుకొని బంగాళాఖాతంలో తూర్పు తైమూర్ లాంటి క్రైస్తవ దేశాన్ని ఏర్పాటు చేస్తామని, అందుకు సహకరించాలని ఓ శ్వేత జాతీయుడు తనకు ప్రతిపాదించారని ఆమె తెలిపారు. తాము ఏర్పాటుచేసే ఆ చిన్నపాటి దేశంలోనే వైమానిక స్థావరాన్ని నెలకొల్పుకునే అవకాశాన్ని కల్పించాలని సదరు శ్వేత జాతీయుడు కోరారని హసీనా వెల్లడించారు. బంగ్లాదేశ్ ఎన్నికల్లో గెలిచేందుకు సహకరిస్తామని ఆ వ్యక్తి చెప్పినప్పటికీ.. తాను అతడి ప్రతిపాదనలను తిరస్కరించానని చెప్పారు. బంగ్లాదేశ్ ఇరుగుపొరుగున ఉన్న దేశాలను ప్రభావితం చేయాలనే కుట్ర ఆ శ్వేత జాతీయుడి ప్రతిపాదనలో స్పష్టంగా కనిపించిందని ఆమె తెలిపారు. గతంలో చాలాసార్లు అమెరికాపై షేక్ హసీనా విరుచుకుపడ్డారు. బంగ్లాదేశ్‌లో ప్రభుత్వం మారాల్సిన అవసరం ఉందని పలుమార్లు అమెరికా కూడా ప్రకటన విడుదల చేసింది. ఈనేపథ్యంలో షేక్ హసీనా చెబుతున్న ఆ శ్వేత జాతీయుడు అమెరికా అధ్యక్షుడు జో బైడెనే అయి ఉంటారని అంతా భావిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed