ఆహారంలో బతికున్న ఎలుక.. ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్

by M.Rajitha |
ఆహారంలో బతికున్న ఎలుక.. ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్
X

దిశ, వెబ్ డెస్క్ : ఆహారంలో బతికున్న ఎలుక కనిపించడంతో టేకాఫ్ అయిన ఫ్లైట్ లో కలకలం రేగింది. దీంతో ఫ్లైట్ ను అత్యవసర ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. స్కావిండేనియన్ ఎయిర్ లైన్స్(Scandivinavian Airlines) కు చెందిన ఓ ఫ్లైట్ ఓస్లో(Oslo) నుండి స్పెయిన్(Spain) కు బయలు దేరింది. ఫ్లైట్ టేకాఫ్ అయిన కాసేపటికి సిబ్బంది ప్రయాణికులకు ఆహారం అందించారు. అందులో ఓ ప్రయాణికుడి ఆహారంలో బతికి ఉన్న ఎలుక కనిపించింది. అంతేకాకుండా అది ఆహారం నుండి బయటకు దూకడంతో ప్రయాణికులు బెంబేలెత్తి పోయారు. దీంతో సిబ్బంది విషయాన్ని పైలట్ కు తెలుపగా.. అప్రమత్తమైన పైలట్ ఫ్లైట్ ను కోపెన్ హగన్ లో అత్యవసర ల్యాండింగ్ చేశాడు. ఈ విషయం కాస్త సోషల్ మీడియాకు చేరడంతో నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ఆహారంలో బతికున్న ఎలుక రావడం ఏంటని మండి పడుతున్నారు. ఈ ఘటనపై స్పందించిన ఎయిర్ లైన్స్.. ఇలాంటి సంఘటనలు మళ్ళీ జరగకుండా జాగ్రత్త వహిస్తామంటూ క్షమాపణలు తెలిపింది.

Advertisement

Next Story