- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆఫ్ఘనిస్తాన్‌లో పేలుడు.. తాలిబన్ గవర్నర్ మృతి
దిశ, వెబ్ డెస్క్: ఆఫ్ఘనిస్తాన్‌లో గురవారం భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో బాల్ఖ్ ప్రావిన్స్‌కు చెందిన తాలిబాన్ గవర్నర్ దుర్మరణం పాలయ్యారు. ఆయనతో పాటు మరో ఇద్దరు సిబ్బంది కూడా మరణించారు. ఈ విషయాన్ని ప్రావిన్స్ పోలీసు ప్రతినిధి అసిఫ్ వజీరి ధృవీకరించారు. అయితే ఈ పేలుడుకు కారణాలేమిటో తెలియరాలేదని ఆయన అన్నారు. ఉదయం 9:30 గంటల ప్రాంతంలో గవర్నర్ ఇంటి నుంచి తన ఆఫీసుకు వచ్చిన సమయంలో దుర్ఘటన జరిగిందన్నారు. ఈ దాడికి ఇప్పటి వరకు ఏ ఉగ్రవాద సంస్థ కూడా బాధ్యత వహిస్తున్నట్లు ప్రకటించలేదు.
చాలాకాలం నుంచి ఆఫ్ఘనిస్తాన్‌లోని తాలిబాన్ పాలకులు, ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులకు మధ్య రక్తపాత వివాదం కొనసాగుతోంది. ఇటీవలి కాలంలో జరిగిన అన్ని బాంబు పేలుళ్లకు ఇస్లామిక్ స్టేట్ బాధ్యత వహించింది. అయితే ఆగస్ట్ 2021లో గ్రూప్ తిరిగి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇలాంటి పరిస్థితుల్లో మరణించిన అత్యున్నత స్థాయి తాలిబాన్ అధికారులలో ముజమ్మిల్ ఒకరు. ఆయన మొదట్లో తూర్పు ప్రావిన్స్ ఆఫ్ నంగర్‌హార్‌కు గవర్నర్‌గా నియమితుడయ్యాడు. అక్కడ మొహమ్మద్ దావూద్ ముజమ్మిల్ ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులపై పోరాటానికి నాయకత్వం వహించారు. అయితే, గతేడాది ఆయన బాల్ఖ్‌కు బదిలీ అయ్యాడు.