ప్రపంచవ్యాప్తంగా ప్రతి 44 సెకన్లకు ఒకరు కరోనాతో చనిపోతున్నారు..

by Satheesh |
ప్రపంచవ్యాప్తంగా ప్రతి 44 సెకన్లకు ఒకరు కరోనాతో చనిపోతున్నారు..
X

దిశ, వెబ్‌డెస్క్: కరోనా మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా ప్రతి 44 సెకన్లకు ఒక వ్యక్తిని చంపేస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) హెచ్చరించింది. అలాగే ఈ వైరస్ అసలు అంతరించి పోదని.. కేవలం తగ్గుముఖం పట్టి సందర్భం వచ్చిందంటే విజృంబిస్తుందని డబ్ల్యూహెచ్‌ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ అన్నారు. అయితే ప్రస్తుతం వివిధ దేశాల్లో కరోనా పెరుగుదల క్షీణత లో ఉందని.. ఇది కొంచెం ఆనందించవలసిన విషయం అన్నారు.

కానీ కరోనా పూర్తిగా కనుమరుగవుతుందని గ్యారెంటీ లేదని ఆయన చెప్పుకొచ్చారు. అయితే ఫిబ్రవరి నుంచి నమోదైన కోవిడ్ మరణాల సంఖ్య 80 శాతానికి పైగా తగ్గిందని.. అయినప్పటికీ ఈ మహమ్మారి ప్రతి 44 సెకన్లకు ఒక వ్యక్తి ప్రాణాలు తీస్తుందని ఘెబ్రేయేసస్ తన రెగ్యులర్ బ్రీఫింగ్ సందర్భంగా చెప్పారు.

Advertisement

Next Story

Most Viewed