టర్కీ అధ్యక్షుడిగా ఎర్డోగన్ విజయం

by Anjali |
టర్కీ అధ్యక్షుడిగా ఎర్డోగన్ విజయం
X

దిశ, వెబ్‌డెస్క్: టర్కీ అధ్యక్షుడిగా రెసెప్ టయిప్ ఎర్డోగాన్ విజయం సాధించారు. దీంతో ఆయన వరుసగా మూడోసారి అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. టర్కీ అధ్యక్ష పదవికి జరిగిన ఎన్నికల్లో ఎర్డోగాన్ 52% ఓట్లతో విజయం సాధించగా.. అతని ప్రత్యర్థి కెమాల్ కిలిక్‌డరోగ్లు 47.9%తో వెనుకబడ్డారు. ఈ విజయం అనంతరం ఎర్డోగాన్ మాట్లాడుతూ.. "మేము మాత్రమే విజేతలు కాదు. టర్కీ ప్రజలందరూ విజేతలే.. అని టర్కీ అధ్యక్షుడు ఎర్డోగన్ అన్నారు. అలాగే ఆయన విజయానికి భారత ప్రధాని నరేంద్ర మోడీ శుభాకాంక్షలు తెలిపారు.

Advertisement

Next Story