- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Dubai : దుబాయ్‌లో తెలంగాణ వాసి మృతి..
దిశ, వెబ్‌డెస్క్: బతుకుదెరువు కోసం దుబాయ్ కు వెళ్లిన తెలంగాణకు చెందిన ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. జగిత్యాల జిల్లా ధర్మపురి మండలంలోని సాయంపేట గ్రామానికి చెందిన ఆవుల ఓదెలు(35) కొన్ని ఏళ్ల క్రితం జీవనోపాధి కోసం దుబాయ్ వెళ్లాడు. అయితే అతను వారం రోజుల కిందట చనిపోయాడని తెలుస్తోంది. ఆవుల ఓదెలు మృతిచెందాడన్న వార్త తెలియడంతో అతని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. అతని మృతదేహాన్ని త్వరగా ఇండియాకు తీసుకురావాలని కుటుంబ సభ్యులు స్థానిక ఎమ్మెల్యే,ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌కు విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్యే వెంటనే స్పందించి తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (CS)కు లేఖ రాశారు. ఎమ్మెల్యే సిఫారసు మేరకు దుబాయ్‌లోని ఇండియన్ ఎంబసీకి CS లేఖ రాశారు. ఓదెలు మృతదేహం త్వరగా ఇండియాకు తీసుకువచ్చేలా చర్యలు తీసుకోవాలని ఆ లేఖలో కోరారు. కాగా మృతుడికి భార్య, ఒక పాప ఉన్నారు.మృతుడి చావుకి గల కారణాలు తెలియాల్సి ఉంది.