- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ట్రంప్ విజయపరంపర.. వరుసగా మూడో విక్టరీ
దిశ, నేషనల్ బ్యూరో : రిపబ్లికన్ పార్టీ అమెరికా అధ్యక్ష అభ్యర్ధిత్వ రేసులో మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దూసుకుపోతున్నారు. తాజాగా నెవాడా రాష్ట్రంలో రిపబ్లికన్ పార్టీ నిర్వహించిన ప్రైమరీ ఎన్నికలో ఆయన విజయఢంకా మోగించారు. నెవాడాలోని మొత్తం 26 మంది రిపబ్లికన్ పార్టీ ప్రతినిధులు ట్రంప్ వైపే మొగ్గు చూపారు. దీంతో వరుసగా మూడో విజయం ట్రంప్ ఖాతాలో జమైంది. మార్చి వరకు దేశంలోని మొత్తం 50 రాష్ట్రాల్లో రిపబ్లికన్ పార్టీ ప్రైమరీ ఎన్నికలు కొనసాగుతాయి. అప్పటివరకు ఈ రాష్ట్రాలకు చెందిన కనీసం 1,215 మంది రిపబ్లికన్ ప్రతినిధుల మద్దతును పొందే వారికే ఆ పార్టీ అధ్యక్ష అభ్యర్ధిత్వం వరిస్తుంది. ఇప్పటివరకు జరిగిన ప్రైమరీలలో ట్రంప్ 63 మంది పార్టీ ప్రతినిధుల మద్దతును కూడగట్టగా, భారత సంతతికి చెందిన నిక్కీ హేలీని 17 మంది సపోర్ట్ చేశారు. రిపబ్లికన్ పార్టీ తరఫున ట్రంప్‌కు పోటీగా నిక్కీ హేలీ మాత్రమే బరిలో మిగిలారు. ఈనెల 24న నిక్కీ హేలీ సొంత రాష్ట్రం సౌత్ కరోలినాలో రిపబ్లికన్ ప్రైమరీ ఎన్నిక జరగనుంది. అక్కడి నుంచి గతంలో రెండుసార్లు గవర్నర్‌గా నిక్కీ గెలిచారు. దీంతో సౌత్ కరోలినాలో నిక్కీ నుంచి ట్రంప్‌కు గట్టిపోటీ ఎదురుకానుంది.