Donald trump: బైడెన్ కంటే కమలాను ఓడించడమే సులభం.. డొనాల్డ్ ట్రంప్

by vinod kumar |   ( Updated:2024-08-18 13:31:20.0  )
Donald trump: బైడెన్ కంటే కమలాను ఓడించడమే సులభం.. డొనాల్డ్ ట్రంప్
X

దిశ, నేషనల్ బ్యూరో: యూఎస్ ప్రస్తుత అధ్యక్షుడు బైడెన్ కంటే కమలా హ్యారీస్‌ను ఓడించడమే సులభమని అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ఈశాన్య పెన్సిల్వేనియాలోని విల్కేస్-బారేలో జరిగిన ర్యాలీలో ట్రంప్ ప్రసంగించారు. కమలా హ్యారిస్ ఒక రాడికల్ అని అభివర్ణించారు. ఆమెను ఈజీగా ఓడించగలనని భావిస్తున్నట్టు తెలిపారు. ఆమె పిచ్చి పిచ్చిగా నవ్వుతుందని ఈ విషయాన్ని ఇప్పటికే ప్రజలు గమనించారని నొక్కి చెప్పారు. కమలా హ్యారిస్ కంటే నేనే బాగుంటానన్నారు. టైమ్ మ్యాగజైన్‌లో ప్రచురించిన కమలా హ్యారిస్ స్కెచ్‌పై ట్రంప్ ఈ ప్రకటన చేశారు. విదేశీ వస్తువులపై బోర్డు అంతటా సుంకాలు విధించే తన ప్రణాళిక యూఎస్ వినియోగదారులపై పని చేయబోదన్నారు. కాగా, విస్కాన్సిన్, మిచిగాన్‌లతో పాటు మూడు రస్ట్ బెల్ట్ రాష్ట్రాల్లో పెన్సిల్వేనియా ఒకటి. 2016లో ట్రంప్ విజయం సాధించడానికి ఇది ఎంతో సహాయపడింది. మరోవైపు ట్రంప్ వ్యాఖ్యలు ఆయనను ఎన్నికల్లో దెబ్బతీస్తాయని కొందరు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నప్పటికీ, అతను వ్యక్తిగతంగా హ్యారిస్‌పై విమర్శలు గుప్పించడం గమనార్హం.

Advertisement

Next Story

Most Viewed