- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మార్స్‌పైన మట్టితో భూమిపైకి మరో ప్రాణాంతక వైరస్ రానుందా..?!
దిశ, వెబ్‌డెస్క్ః చాలా సంవత్సరాలుగా, పరిశోధకులు మార్స్ ఉపరితలం నుండి నమూనాలను సేకరించడానికి ప్రయత్నిస్తున్నారు. చైనా పంపించిన టియాన్‌వెన్-2 నుండి NASA, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ (ESA) ప్రిజర్వెన్స్ రోవర్ వరకు అంగారకుడిపై సహజమైన నమూనాలను సేకరించడానికి వివిధ మిషన్‌లు యాక్టీవ్‌గా ఉన్నాయి. ఆ గ్రహంలో ఉపరితలం నుండి, ఆ వాతావరణంలో మట్టిని "గ్రాబ్ అండ్ గో" పద్ధతిలో సేకరించడం వరకు రోబోట్‌లు వివిధ వ్యూహాలను కనబరుస్తున్నాయి. ఇంత వరకూ ఓకే గానీ, వీటన్నింటి వెనుక ఒక ప్రశ్న తలెత్తుతోంది. ఇలా సేకరించి, గ్రహాంతర ప్రదేశం నుండి తెచ్చిన నమూనాలు భూమిపైన జీవులకు ప్రమాదాన్ని కలిగించవా..?! అన్నదే ఈ సందేహం.
చాలా మందికి ఆండ్రోమెడ స్ట్రెయిన్ అనే సినిమా తెలిసి ఉండొచ్చు. 'ఆండ్రోమెడ స్ట్రెయిన్' మైఖేల్ క్రిక్టన్ రాసిన ఒక నవల. దీని ఆధారంగా రూపొందించబడిన చిత్రమే ఇది. ఒక చిన్న సిటీలో అమెరికా పరిశోధనా ఉపగ్రహం క్రాష్ అవుతుంది. దానితో పాటు ఒక ప్రాణాంతకమైన భూలోకేతర మైక్రోస్కోపిక్ వైరస్ వచ్చి, సగం జనాభా తుడిచిపెట్టుకుపోతుంది. ఇప్పుడు, ఇది రీల్ లైఫ్ బయటే జరిగితే?! కల్పన కాస్తా వాస్తవంగా మారి, అంగారక గ్రహం నుండి ప్రాణాంతకమైన వైరస్‌ని తీసుకువస్తే..?!
నాసాకు చెందిన మాజీ ప్లానెటరీ ప్రొటెక్షన్ ఆఫీసర్, కాస్సీ కాన్లీ స్పేస్.కామ్‌తో మాట్లాడుతూ, "అంతరిక్ష అన్వేషణ మొదలైనప్పటి నుండి, భూమి రక్షణ రిత్యా, అంగారక గ్రహం నుండి తెచ్చే ఎలాంటి నమూనాలైనా 'రిస్ట్రిక్టెడ్ ఎర్త్ రిటర్న్స్'గా పరిగణించాలనే నియమం ఉంది. నమూనాలను, భూమి రెండింటినీ రక్షించడానికి అత్యంత కఠినమైన నియంత్రణ అవసరం" అని వివరించారు. ఇక, యునైటెడ్ స్టేట్స్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక శాస్త్రీయ నిపుణుల ప్యానెళ్లు అంగారక గ్రహం నుండి నమూనాలు భూమి పర్యావరణానికి ముప్పు కలిగించవచ్చా అనే దానిపై అధ్యయనం చేస్తున్నాయి. ఈ ప్యానెల్స్ పరిశోధనలు అంగారకుడిపై ఉన్న పదార్థాలు మన జీవగోళానికి జీవసంబంధమైన ప్రమాదాన్ని కలిగి ఉండే అవకాశం చాలా తక్కువ అని చెబుతున్నాయి. ఇక, "తక్కువ ప్రమాదం" గా వర్ణించినప్పటికీ, ఇది అసలు ప్రమాదమే ఉండదని మాత్రం వాళ్లు చెప్పకపోవడం విశేషం.