లోక్‌సభ నుంచి అనర్హత పొందాల్సి వస్తుందని ఊహించలేదు: రాహుల్ గాంధీ

by Harish |   ( Updated:2023-06-01 14:57:32.0  )
లోక్‌సభ నుంచి అనర్హత పొందాల్సి వస్తుందని ఊహించలేదు: రాహుల్ గాంధీ
X

స్టాన్‌ఫర్డ్ (అమెరికా): తాను రాజకీయాల్లోకి ప్రవేశించినపుడు లోక్‌సభ నుంచి అనర్హత పొందాల్సి వస్తుందని ఊహించలేదని, అయితే దానివల్ల ప్రజలకు సేవ చేసే గొప్ప అవకాశం లభించిందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. రాజకీయాలు ఇలాగే ఉంటాయని ఇప్పుడు భావించాల్సి వస్తోందని ఆయన వ్యాఖ్యానించారు.

కాలిఫోర్నియాలోని ప్రతిష్టాత్మక స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీలో భారతీయ విద్యార్థులు, ప్రొఫెసర్లను ఉద్దేశించి రాహుల్ ప్రసంగించారు. పరువునష్టం కేసులో సూరత్‌ కోర్టు తీర్పుతో పార్లమెంట్‌ సభ్యత్వాన్ని కోల్పోవడంపై ఆయన స్పందించారు. ఇలాంటి కేసులో గరిష్ట శిక్ష ఎదుర్కొన్న మొదటి వ్యక్తిని తానే కావొచ్చని వ్యాఖ్యానించారు.

అధికార పార్టీ బీజేపీకి భారీ స్థాయిలో ఆర్థిక ప్రాబల్యం, వ్యవస్థలన్నీ హస్తగతం అయిపోయాయని ఆరోపించారు. ప్రజాస్వామిక హక్కుల కోసం దేశంలో తమతోపాటు యావత్ ప్రతిపక్ష పార్టీలన్నీ పోరాడుతున్నాయని రాహుల్ చెప్పారు. ఈ తరుణంలోనే తాను భారత్ జోడో యాత్ర చేపట్టానని తెలిపారు.

భారతదేశానికి చెందిన కొందరు యువజనులు ఇక్కడ ఉన్నారని, వారితో సంబంధ బాంధవ్యాలు పెంపొందించుకోవాలని తాను కోరుకుంటున్నానని పేర్కొన్నారు. ప్రధాని మోడీ ఇక్కడకు వచ్చి ఆ పని ఎందుకు చేయడం లేదో తనకు అర్థం కావడం లేదని కామెంట్ చేశారు. ఈ సందర్భంగా కార్యక్రమ సంధానకర్త జోక్యం చేసుకుంటూ భారత ప్రధాని మోడీ ఎప్పుడైనా స్టాన్‌ఫర్ట్ యూనివర్సిటీని సందర్శించి విద్యార్థులు, ప్రొఫెసర్లతో మాట్లాడొచ్చని ప్రకటించారు.

Also Read..

'ఇలా జరుగుతుందని ఊహించలేదు': రాహుల్ గాంధీ

Advertisement

Next Story