- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
విడాకులు తీసుకునే దేశాల్లో భారత దేశం ఎన్నో స్థానంలో ఉందో తెలుసా?
దిశ, వెబ్ డెస్క్: ప్రస్తుతం చాలా మంది జంటలు చిన్న చిన్న కారణాలతో పెళ్లిని పెటాకులు చేసుకుని విడిపోయేందుకు ఎక్కువ ప్రాధాన్యత చూపిస్తున్నారు. అయితే భార్య, భర్తలు విడిపోవాలంటే హిందూ వివాహ చట్టం (1955 ) ప్రకారం ఆరు నెలలు గడిచిన తర్వాతనే విడాకులు మంజూరు చేసేవారు. భార్యాభర్తల మధ్య విడాకుల వ్యవహారంపై సుప్రీంకోర్టు సోమవారం సంచలన తీర్పునిచ్చిన విషయం తెలిసిందే.
ఇక నుంచి భార్యాభర్తల ఇద్దరికీ ఇష్టమైతే విడాకులు తీసుకునేందుకు ఆరు నెలల దాకా వేచి చూడాల్సిన అవసరం లేదని తెలిపింది. ఇదిలా ఉంటే ప్రపంచంలో విడాకులు తీసుకుంటున్న దేశాల్లో భారత్ ఏ స్థానంలో ఉందనే విషయం వార్తల్లో చర్చనీయాంశంగా మారింది. అయితే ఎక్కువ శాతం విడాకులు తీసుకుంటున్న దేశాల్లో లక్సెంబర్గ్ మొదటి స్థానంలో ఉంది. పెళ్లి తర్వాత 87 శాతం మంది విడాకులు తీసుకుని విడిపోతున్నారు. కాగా, రెండవ స్థానంలో స్పెయిన్ ఉండగా.. మూడవ స్థానంలో రష్యా ఉంది. అమెరికాలో 46 శాతం జంటలు విడాకులు తీసుకుంటున్నారు. తక్కువ జంటలు డివోర్స్ తీసుకుంటున్న దేశాల్లో భారతదేశం మొదటి స్థానంలో ఉంది. ఇక్కడ ప్రతీ 1000 వివాహాల్లో 13 వివాహాలు పెటాకులవుతున్నట్లు ఓ సర్వే తేల్చింది. ఇండియాలో విడాకులు తీసుకుంటున్నవారు కేవలం 1 శాతం ఉన్నట్లు తెలుస్తోంది.