- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆఫ్రికాలో ఫ్రెడ్డీ తుఫాన్ భీభత్సం.. 500 దాటిన మరణాల సంఖ్య
by Javid Pasha |
X
లిలింగ్వో: ఆగ్నేయ ఆఫ్రికాలో ఫ్రెడ్డీ తుఫాన్ భీభత్సం సృష్టిస్తోంది. భారీ వర్షాల ధాటికి పలు ఘటనల్లో మరణించిన వారి సంఖ్య 500 దాటిందనిఅధికారులు తెలిపారు. గత నెలలో ప్రారంభమైన ఈ తుఫాన్ ఇంకా కొనసాగుతుందని చెప్పారు. చరిత్రలో మునుపెన్నడు లేని దీర్ఝకాల తుఫాన్ గా పేర్కొన్నారు. ఒక్క మలావీలోనే 400 కు పైగా మరణాలు చోటుచేసుకున్నాయని అధ్యక్షుడు లాజరస్ ఛక్వేరా తెలిపారు. ఈ క్రమంలో భారీ నష్టంతో 14 రోజుల పాటు సంతాప దినాలను ప్రకటించారు.
దేశవ్యాప్తంగా తీవ్ర వర్షాలు, వరదలతో ప్రభావితమైన 3 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు చెప్పారు. మొజాంబిక్ లో 67 మంది చనిపోయినట్లు ఆ దేశ అధ్యక్షుడు ఫిలిపి న్యూసీ తెలిపారు. సుమారు 50 వేల మందికి పైగా నిరాశ్రయులు అయ్యారని వెల్లడించారు. తుఫాన్ తీవ్రతకు భారీ ఎత్తున ఆస్తి నష్టం వాటిల్లినట్లు తెలిపారు.
Advertisement
Next Story