హైదరాబాద్‌లోనే కాదు.. అమెరికాలోనూ కుక్కల బెడద! పోలీసు కాల్పులు

by Ramesh N |   ( Updated:2024-05-19 12:55:15.0  )
హైదరాబాద్‌లోనే కాదు.. అమెరికాలోనూ కుక్కల బెడద! పోలీసు కాల్పులు
X

దిశ, డైనమిక్ బ్యూరో: అమెరికాలో ఓ పోలీసు అధికారి కుక్కుల పై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో కుక్కలు మృతి చెందాయి. దీనికి సబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కుక్కలపై ఫైరింగ్ చేయడానికి గల కారణాలు ఏమిటంటే? యునైటెడ్ స్టేట్స్ ఫిలడెల్ఫియాలో ఒక వ్యక్తిపై విరుచుకుపడి విపరీతంగా దాడి చేస్తున్న కుక్కలపై పోలీసు కాల్పులు జరిపాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఫిలడెల్ఫియాలోని మాంటువా పరిసరాల్లో బుధవారం ఉదయం వీధిలో నాలుగు కుక్కలు 53 ఏళ్ల వ్యక్తిపై విచక్షణ రహితంగా దాడి చేస్తున్నాయి. వెంటనే స్థానికులు విడిపించే ప్రయత్నం చేసిన వారిపైకి కూడా కుక్కలు ఎగబడ్డాయి. ఆ సమయంలో అక్కడే పెట్రోలింగ్‌లో ఉన్న పోలీసులు వెంటనే కుక్కలను వెళ్లగొట్టే ప్రయత్నం చేస్తారు.

కానీ పరిస్థితి చేయి దాటడంతో పోలీస్ అధికారి కుక్కలను తుపాకీతో కాల్చివేస్తాడు. అయితే, కేన్ కోర్సో, మూడు పిట్ బుల్ అనే బ్రీడ్ కుక్కలు అవి. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. హైదరాబాద్‌లోనే కాదు.. అమెరికాలో కూడా ఈ కుక్కల బెడద ఉంటుందా? అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు భారత్‌లో ఇలా అధికారి కుక్కలను చంపితే ఆఫీసర్‌పై 2013 చట్టం ప్రకారం కేసు నమోదు అవుతుందని ఓ నెటిజన్ వివరించారు.

Advertisement

Next Story

Most Viewed