Swadeshi butter: స్వదేశీ బటర్ పేరుతో కస్టమర్లకు బురిడీ.. తిక్క కుదిర్చిన న్యూజిలాండ్ కోర్టు

by Prasad Jukanti |
Swadeshi butter: స్వదేశీ బటర్ పేరుతో కస్టమర్లకు బురిడీ.. తిక్క కుదిర్చిన న్యూజిలాండ్ కోర్టు
X

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రస్తుతం ఆహార పదార్థాల కల్తీ అనేది ప్రపంచ దేశాలకు సవాలుగా మారింది. దీంతో స్వదేశీ వస్తువులు, పదార్థాలకు యమ డిమాండ్ పెరిగింది. స్వదేశీయత అనే కస్టమర్ల బలహీనతను క్యాష్ చేసుకునేందుకు ప్రయత్నించిన ఓ మిల్క్ ప్రొడక్ట్ కంపెనీకీ కోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. భారీ జరిమానా విధించి తిక్క కుదిర్చింది. అయితే ఈ ఘటన మన దేశంలో జరగకపోయినా మన దేశంతోనే ముడిపడి ఉండటం హాట్ టాపిక్ గా మారింది. న్యూజిలాండ్ లోని పాల ఉత్పత్తి సంస్థ మిల్కియో ఫుడ్స్ లిమిటెడ్ ఉత్పత్తి చేస్తున్న బటర్ (వెన్న) విషయంలో కస్టమర్లతు తప్పుదారి పట్టించింది. భారతదేశం నుంచి దిగుమతి చేస్తున్న వెన్నను '100 శాతం ప్యూర్ న్యూజిలాండ్' బటర్ అంటూ మార్కెట్లో విక్రయాలు చేస్తోంది. స్వదేశీ సెంటిమెంట్ తో చాలా మంది ఈ సంస్థకు చెందిన ప్రొడక్ట్ ను కొలనుగోలు చేస్తున్నారు.ఇయితే ఈ కంపెనీ నిర్వాకం, తప్పుడు ప్రకటనలపై న్యూజిలాండ్ కామర్స్ కమిషనన్ కోర్టులో పిటిషన్ దాఖలు అయింది. దీంతో మోసపూరిత ప్రకటనల ద్వారా కస్టమర్లను తప్పదారిపెట్టించిన మిల్కియో ఫుడ్స్ కు రూ. 2.19 కోట్లకు పైగా కోర్టు జరిమానా విధించింది. అలాగే న్యూజిలాండ్ లోనే ఉత్పత్తి అయిందని గుర్తించేందుకు విశ్వసనీయ చిహ్నం ఫెర్న్ మార్క్ లోగోను పొందేందుకు ఈ సంస్థ తప్పుడు, అసంపూర్ణ సమాచారం అందించిందని కోర్టు గుర్తించింది.

Advertisement

Next Story