పాకిస్తాన్‌కు చైనా భారీ షాక్.. ఏమైందో తెలుసా ?

by Hajipasha |
పాకిస్తాన్‌కు చైనా భారీ షాక్.. ఏమైందో తెలుసా ?
X

దిశ, నేషనల్ బ్యూరో : ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్‌.. ఇప్పుడు ఆ ఉగ్రవాదంతోనే నాశనమైపోతోంది. ఇటీవల ఖైబర్ పఖ్తున్‌ఖ్వా ప్రావిన్స్‌లోని షాంగ్లా జిల్లాలో ఉన్న ఓ జలవిద్యుత్ ప్రాజెక్ట్‌ లక్ష్యంగా ఉగ్రవాదులు జరిపిన ఆత్మాహుతి దాడిలో ఐదుగురు చైనీయులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనను సదరు జలవిద్యుత్ ప్రాజెక్టు పనులను నిర్వహిస్తున్న చైనా కంపెనీ పవర్ కన్‌స్ట్రక్షన్ కార్పొరేషన్ ఆఫ్ చైనా (పీసీసీసీ) సీరియస్‌గా పరిగణించింది. అక్కడ సివిల్ పనులను చేయబోమని ప్రకటించింది. ఖైబర్ పఖ్తున్‌ఖ్వా ప్రావిన్స్‌ పరిధిలోనే తమ కంపెనీ నిర్వహించే మరో జలవిద్యుత్ ప్రాజెక్ట్‌లో పనిచేసే దాదాపు 2వేల మంది కార్మికులను ఉద్యోగాల నుంచి తొలగించింది.

Advertisement

Next Story

Most Viewed