- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
భూటాన్ రాజ కుటుంబం స్థలాల్లోనూ చైనా కబ్జా
దిశ, నేషనల్ బ్యూరో : ఇరుగు పొరుగుదేశాలలో చైనా దురాక్రమణల పర్వం కొనసాగుతోంది. భూటాన్ ఆర్మీ బలహీనంగా ఉండటాన్ని ఆసరాగా చేసుకున్న డ్రాగన్.. భూటాన్‌లో క్రమంగా తన కబ్జాలను పెంచుతూపోతోంది. ఏడాది కిందటి వరకు భూటాన్ బార్డర్‌లోని ఏరియాలనే కబ్జా చేస్తూ వచ్చిన చైనా.. ఇప్పుడు ఏకంగా భూటాన్ రాజ కుటుంబానికి చెందిన వారసత్వ స్థలాలను కూడా కబ్జా చేస్తోంది. ఏమాత్రం సంకోచించకుండా, అంతర్జాతీయ చట్టాల గురించి ఆలోచించకుండా ఆయా ఏరియాల్లో ఏకంగా టౌన్ షిప్‌లను నిర్మిస్తోంది. తాజాగా అమెరికా శాటిలైట్ ఇమేజరీ కంపెనీ మక్సార్ విడుదల చేసిన శాటిలైజ్ ఫొటోలతో ఈవిషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఫొటోలన్నీ గత నెలలో తీసినవే కావడం గమనార్హం.
ఓ వైపు చర్చలు.. మరోవైపు కబ్జాలు
ఈశాన్య భూటాన్‌లోని సాంస్కృతిక ప్రాముఖ్యత కలిగిన ప్రాంతం బేయుల్ ఖేన్‌పాజోంగ్. ఈ ఏరియాలోని నదీ లోయ వెంట చైనా అక్రమంగా పెద్దఎత్తున టౌన్‌షిప్‌లను నిర్మించింది. ‘‘భూటాన్ రాజ కుటుంబం దాని పూర్వీకుల వారసత్వ అవశేషాలను బేయుల్ ఖేన్‌పాజోంగ్ పర్వత ప్రాంతంలోనే గుర్తించింది. అటువంటి కీలకమైన చోట చైనా కబ్జాకు పాల్పడటం ఆందోళనకరం’’ చరిత్రకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఓ వైపు చైనా ఆర్మీ కబ్జాలపై భూటాన్ ప్రతినిధులు బీజింగ్‌కు వెళ్లి చర్చలు జరుపుతుంటే.. మరోవైపు చైనా ఆర్మీ భూటాన్‌లోని కొత్త కొత్త ప్రాంతాల్లో కబ్జా జెండాలను పాతే ప్రక్రియను కంటిన్యూ చేస్తుండటం గమనార్హం.