- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
China: అందమైన పురుషులు, మహిళల పట్ల జాగ్రత్త.. విద్యార్థులకు హెచ్చరిక
దిశ, నేషనల్ బ్యూరో: "అందమైన పురుషులు", "అందమైన స్త్రీల" పట్ల జాగ్రత్తగా ఉండాలని తన విద్యార్థులకు చైనా గూఢచార ఏజెన్సీ హెచ్చరించింది. వలపు వల విసురుతూ, తమతో స్నేహం చేసినట్లుగా చేసి విదేశీ గూఢచారులు చైనాకు సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని దొంగలించడానికి కుట్రలు చేస్తున్నారని కాబట్టి విద్యార్థులంతా కూడా పరిచయం లేని అందమైన పురుషులు, మహిళల పట్ల నిరంతరం జాగ్రత్త వహించాలని ఏజెన్సీ తెలిపింది.
WeChatలో పోస్ట్ చేసిన ఒక ప్రకటన ప్రకారం, భద్రతా మంత్రిత్వ శాఖ బుధవారం విద్యార్థులకు వివరణాత్మక హెచ్చరికలను విడుదల చేసింది. గత సంవత్సరం WeChat ఖాతాను తెరిచినప్పటి నుండి విదేశీ గూఢచారులు చైనా సమాచారాన్ని తెలుసుకోవడానికి అందమైన పురుషులు, స్త్రీల పేరుతో చైనీయులను ఆకర్షించడానికి కృషి చేస్తున్నారని మంత్రిత్వ శాఖ తెలిపింది. ముఖ్యంగా వారంతా కూడా విద్యార్థులను ఎక్కువగా లక్ష్యంగా చేసుకున్నట్లు రాష్ట్ర భద్రతా విభాగాలు గుర్తించాయని పేర్కొంది.
విదేశీ గూఢచార సంస్థలు సోషల్ మీడియా, టెలిఫోన్ లేదా వీడియో కాన్ఫరెన్సింగ్, ఆన్‌లైన్ డేటింగ్‌లు, ఉద్యోగ ప్రకటనలు పేరిట చైనా విద్యార్థులకు వల విసురుతున్నాయి. యూనివర్సిటీ పండితులు, శాస్త్ర పరిశోధకులు లేదా కన్సల్టెంట్‌లుగా పరిచయం చేసుకుంటూ, అందమైన అబ్బాయిలు, స్త్రీల పేరుతో యువతను ప్రేమ ఉచ్చులోకి లాగి సమాచారం తెలుసుకుంటున్నట్లు చైనా గూఢచార సంస్థ తెలిపింది. ఇదిలా ఉంటే గత కొంత కాలంగా చైనా.. తమ దేశ సమాచారాన్ని తెలుసుకోవడానికి ఇతర దేశాలు గూఢచర్యం చేస్తున్నట్టు ఆరోపణలను చేస్తుంది. అయితే ఆ దేశాల వివరాలను మాత్రం వెల్లడించడం లేదు.