- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కొవిడ్ కంటే డేంజరస్ వైరస్‌ను తయారు చేస్తున్న చైనా-పాక్!
దిశ, వెబ్ డెస్క్ : చైనా, పాకిస్థాన్ కలిసి సంయుక్తంగా కోవిడ్ కంటే చాలా ప్రమాదకరమైన వైరస్‌ను తయారు చేస్తున్నట్లు పలు నివేదికలు వెల్లడించాయి. పాకిస్థాన్‌లోని రావల్పిండిలో అత్యంత భద్రత ఉండే ఓ ల్యాబ్‌లో దీనికి సంబంధించిన పరిశోధనలు కూడా జరుగుతున్నాయని తెలిసిన సమాచారం. వుహాన్ ఇన్‌స్టిట్యూట్ & డిఫెన్స్ సైన్సెస్ అండ్ టెక్నాలజీ ఆర్గనైజేషన్ నేతృత్వంలో 2020 నుంచే ఈ పరిశోధనలు జరుగుతున్నట్లు న్యూస్ ఏజెన్సీ ANI తెలిపింది. 'జియో పాలిటిక్ కథనాన్ని కోట్ చేసి ANI ఈ వివరాలను వెల్లడించింది.
ఐతే , జియో-పొలిటిక్ వార్తలను పాకిస్థాన్ ఖండించింది. రావల్పిండిలో మేము ప్రత్యేక ప్రాజెక్ట్‌ను నిర్వహిస్తున్నామని వచ్చిన నివేదికలను కొట్టిపారేసింది. నివేదికలో ప్రస్తావించిన పాకిస్థాన్ బయో-సేఫ్టీ లెవల్-3 (BSL -3) ల్యాబొరేటరీ గురించి ఎలాంటి రహస్యాలు లేవని పాకిస్థాన్ విదేశాంగ కార్యాలయం పేర్కొంది.
నివేదికలో పేర్కొన్న వివరాల ప్రకారం ల్యాబొరేటరీ రావల్పిండిలోని చక్లాలా కంటోన్మెంట్‌లో ఉంది. ఇది అత్యంత కట్టుదిట్టమైన రక్షణ వలయం మధ్య ఈ ల్యాబ్ ఉందని, దాని చుట్టూ టూ-స్టార్ జనరల్ భద్రతాధికారులు ఎప్పుడూ ఉంటారని నివేదికలో వెల్లదించారు.
కోవిడ్ కంటే చాలా ప్రమాదకర వైరస్ ను అభివృద్ధి చేయడంలో చైనా రహస్యంగా కృషి చేస్తోందని గతంలోనూ పలు అంతర్జాతీయ మీడియా కథనాల్లో వెల్లడించారు. కోవిడ్ వైరస్ ఇప్పటికే ప్రపంచంలోని పలు దేశాలని అల్లకల్లోలం సృష్టించిన నేపథ్యంలో ఇటువంటి వార్తలు విన్నప్పుడు ప్రజలను భయాందోళన గురి అయ్యేలా చేస్తున్నాయి.
Read more:
నగ్నంగా వీడియో కాల్స్.. ముఖం కనిపించకుండా అలా చేస్తూ వేధింపులు