- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఢిల్లీ జీ20 సమావేశానికి చైనా విదేశాంగ మంత్రి
by S Gopi |
X
న్యూఢిల్లీ: ఈ నెల 2న జరిగే జీ20 విదేశాంగ మంత్రుల సమావేశానికి చైనా మంత్రి హాజరుకానున్నారు. గురువారం దేశరాజధాని ఢిల్లీలో జరగనున్న సమావేశానికి చైనా విదేశాంగ మంత్రి కిన్ గాంగ్ హజరుకానున్నట్లు పలు అంతర్జాతీయ కథనాలు పేర్కొన్నాయి. జీ20 సమావేశాలు అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటున్న సవాళ్లపై ప్రధాన దృష్టి పెట్టింది. జీ-20 విదేశాంగ మంత్రుల సమావేశం బహుపాక్షికతపై సానుకూల సంకేతం పంపేలా అన్ని పార్టీలతో కలిసి పనిచేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని చైనా ప్రతినిధి మావో నింగ్ తెలిపారు. ఈ నెల 1 నుంచి ప్రత్యక్ష పద్ధతిలో విదేశాంగ మంత్రుల సమావేశం జరగనుంది. భారత్ అధ్యక్షత వహిస్తున్న జీ20కి థీమ్‌గా వసుధైవ కుటుంబం ఉంది. కాగా, తూర్పు లఢఖ్‌లో చైనాతో ఉద్రిక్త పరిస్థితుల నడుమ ఆ దేశ మంత్రి భారత్‌కు రానుండడం ఆసక్తికరంగా మారింది.
Advertisement
Next Story