Breaking : జర్మనీలో జాబ్ చేయాలనుకునే భారతీయులకు గుడ్ న్యూస్

by Maddikunta Saikiran |
Breaking : జర్మనీలో జాబ్ చేయాలనుకునే భారతీయులకు గుడ్ న్యూస్
X

దిశ, వెబ్‌డెస్క్: జర్మనీ ప్రభుత్వం భారతీయులకు గొప్ప శుభవార్త చెప్పింది. జర్మనీ ప్రభుత్వం తాజాగా వర్క్ వీసా ప్రాసెసింగ్ సమయాన్ని గణనీయంగా తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. వీసా ప్రాసెసింగ్ సమయాన్ని ఏకంగా 9 నెలల నుండి 2 వారాలకు తగ్గించింది. జర్మనీ విదేశాంగ మంత్రి అన్నలెనా బేర్‌బాక్ ఈ విషయాన్ని వెల్లడించారు. జర్మనీ వర్క్ వీసాల కోసం దరఖాస్తు చేసినప్పుడు వీసా ప్రాసెసింగ్ కోసం ఎక్కువ టైం పడుతుందని. దీని వల్ల చాలా మంది సమయం వృధా అయితుందని, అందుకే వర్క్ వీసాల కోసం వేచి ఉండే సమయాన్ని తగ్గించాలని జర్మనీ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని అన్నలెనా బేర్‌బాక్ పేర్కొంది.మాకు ఇక్కడ నైపుణ్యం కలిగిన కార్మికుల అవసరం చాలా ఉంది. అందుకే ఢిల్లీ ఎంబసీలో వర్క్ వీసాల కోసం వేచి ఉండే సమయాన్ని రెండు వారాలకు తగ్గించగలిగాము. ఇంతకముందు దీనికి తొమ్మిది నెలల సమయం పట్టేదని అన్నలెనా బేర్‌బాక్ తెలిపారు.

కాగా జర్మనీ ఎకనామిక్ ఇన్‌స్టిట్యూట్ (IW) తెలిపిన వివరాల ప్రకారం.. జర్మనీకి ఇప్పుడు కొత్త కార్మికుల అవసరం చాల ఉంది. 2023 నుంచి జర్మనీలో దాదాపుగా 5,70,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఉద్యోగుల కొరత దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ముఖ్యంగా రవాణా, మ్యానుఫ్యాక్చరింగ్, హెల్త్ డిపార్ట్మెంట్ ఇంజనీరింగ్ , ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT), అలాగే Civil వంటి అనేక రంగాలలో ఉద్యోగుల కొరత చాలా ఉన్నట్టు తెలుస్తోంది. వీసా ప్రాసెసింగ్ టైం వేగవంతం చేయడం వల్ల చాలా మంది ఉద్యోగులు జర్మనీలో పని చేయడానికి ఆసక్తి చూపిస్తారని, దీంతో కష్టాల్లో ఉన్న దేశ ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచడంలో ఈ నిర్ణయం ఎంతో ఉపయోగ పడుతుందని ఎకనామిక్ ఇన్‌స్టిట్యూట్ (IW) పేర్కొంది. ఫెడరల్ ఫారిన్ ఆఫీస్ ప్రకారం, 2024 జనవరి నుండి జూన్ మధ్య దాదాపుగా 80,000 వీసాలను జర్మనీ మంజూరు చేసినట్టు సమాచారం. అందులో సగం 40,000 వర్క్ వీసాలు మంజూరు చేశారు. అంటే 2023 కంటే 3,000 ఎక్కువ వర్క్ వీసాలు ఈ సంవత్సరం మంజూరు చేశారు.

Advertisement

Next Story

Most Viewed