- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఆప్ఘన్ మ్యూజియంలో బాంబులు, రాకెట్ లాంచర్లు: విజయానికి గుర్తుగా ప్రదర్శించిన తాలిబన్లు
దిశ, నేషనల్ బ్యూరో: మ్యూజియం అనగానే కళలు, సైన్స్, చరిత్రకు సంబంధించిన కళాఖండాలు వివిధ రకాల వస్తువులు గుర్తుకొస్తాయి. కానీ అప్ఘనిస్థాన్‌లో అధికారంలో ఉన్న తాలిబన్లు మాత్రం ఆ దేశంలోని ప్రముఖ మజార్-ఈ-షరీఫ్ మ్యూజియంలో ఇంట్లో తయారు చేసే బాంబులు, రాకెట్ లాంచర్లు, ఇతర అణ్వాయుధాలను ప్రదర్శనకు ఉంచారు. విదేశీ సైనికులపై తాలిబన్లు సాధించిన విజయానికి గుర్తుగా వీటిని మ్యూజియంలో పెట్టినట్టు తెలుస్తోంది. పురాతన ఖురాన్లు, పురాతన ఆఫ్ఘన్ నాణేలతో పాటు ఆయుధాలను ప్రదర్శనకు ఉంచారు. అయితే మ్యూజియంలో ప్రదర్శించిన ఆయుధాలకు పాత చరిత్ర ఏం లేక పోయినప్పటికీ ఇవన్నీ విజయంలో కీలక పాత్ర పోషించాయని మ్యూజియం డైరెక్టర్ అబ్దుల్ ఖయూమ్ అన్సారీ తెలిపారు. మ్యూజియానికి వచ్చే పర్యాటకులు బాంబులు, రాకెట్ లాంచర్లను ఫోటో తీయడం నిషేధించినట్టు వెల్లడించారు.
మ్యూజియంలోని ఓ గదిలో వీటిని ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. చుట్టూ కుండలు, పింగాణీ శకలాలు, పేలుడు పదార్థాలు, ఒక గాజు పెట్టెలో నిక్షిప్తం చేయబడిన ఎరుపు రంగు హోండా మోటర్‌బైక్, రాకెట్‌తో నడిచే గ్రెనేడ్ లాంచర్‌ను ప్రదర్శనకు ఉంచారు. ఈ బైకును రవాణాకు ఉపయోగించినట్టు తెలుస్తోంది. తాలిబన్లు తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత మసీదులోకి మహిళలను ప్రవేశించకుండా నిషేధించినందున మ్యూజియంలోకి కూడా మహిళలను అనుమతించడం లేదు. కాగా, 2021లో తాలిబన్లు అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే.