Netanyahu : ఇజ్రాయెల్ ప్రజలకు ప్రధాని నెతన్యాహు క్షమాపణలు

by Hajipasha |
Netanyahu : ఇజ్రాయెల్ ప్రజలకు ప్రధాని నెతన్యాహు క్షమాపణలు
X

దిశ, నేషనల్ బ్యూరో : ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు తమ దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పారు. 2023 సంవత్సరం అక్టోబరు 7న ఇజ్రాయెల్ సరిహద్దు ప్రాంతాలలోకి హమాస్ మిలిటెంట్లు చొరబడి భీతావహ పరిస్థితులను సృష్టించారు. ఆనాడు ఎంతోమంది ఇజ్రాయెలీలను హమాస్ మిలిటెంట్లు కిడ్నాప్ చేసి తీసుకెళ్లగా, కొందరిని అక్కడికక్కడే హత్య చేశారు. ఆ దారుణ ఘటనలను గుర్తు చేసుకుంటూ, ఆనాడు సరిహద్దుల్లో భద్రతా వైఫల్యం జరిగినందుకు తాను ఇజ్రాయెలీలను క్షమాపణలు కోరుతున్నట్లు నెతన్యాహు వెల్లడించారు.

ఆ ప్రమాదాన్ని నివారించలేకపోయినందుకు విచారం వ్యక్తం చేశారు. ప్రఖ్యాత టైమ్ మ్యాగజైన్‌కు ఇంటర్వ్యూ ఇస్తూ ఈవిషయాన్ని నెతన్యాహు వెల్లడించారు. మరోవైపు ఇజ్రాయెల్‌పై ఇరాన్ దాడి చేసే అవకాశం ఉండటంతో అమెరికా పూర్తిగా అలర్ట్ మోడ్‌లోకి వచ్చేసింది. అమెరికాకు చెందిన ఎఫ్-22 స్టెల్త్ యుద్ధ విమానాలు గురువారం ఉదయమే పశ్చిమాసియా ప్రాంతానికి చేరుకున్నాయి. ఇరాన్, దాని అనుబంధ మిలిటెంట్ సంస్థలు ఇజ్రాయెల్‌పై దాడికి తెగబడితే అడ్డుకోవాలనే యుద్ధ వ్యూహంతో అమెరికా ఉంది.

Advertisement

Next Story

Most Viewed