రూ. 3 కోట్ల ఇల్లు, స‌ముద్రం పాలు.. న‌మ్మ‌లేని వీడియో!

by Sumithra |
రూ. 3 కోట్ల ఇల్లు, స‌ముద్రం పాలు.. న‌మ్మ‌లేని వీడియో!
X

దిశ‌, వెబ్‌డెస్క్ః మ‌ళ్లీ మ‌ళ్లీ అవే అన‌ర్థాల‌కు గుర‌వుతూనే ఉన్నాం. మ‌ళ్లీ మ‌ళ్లీ అదే త‌ప్పులు చేస్తూనే ఉన్నాం! బ‌తికినంత కాలం సంపాద‌న, సౌక‌ర్యాలంటూ మ‌నుషుల చేస్తున్న చ‌ర్య‌లు యావ‌త్ ప్ర‌పంచాన్ని నాశ‌నం దిశ‌గా నడిపిస్తున్నాయంటే న‌మ్మ‌క త‌ప్ప‌దు. ఇటీవ‌ల‌, నార్త్ కరోలినాలోని ఔటర్ అనే ప్రాంతం ఒడ్డున ఉన్న ఓ బీచ్ హౌస్ సముద్రంలో కూలిపోవడంతో అందరూ షాక్ అయ్యారు. స్థానిక నివేదిక ప్రకారం, సముద్రంలో భారీ అలలు ఎగసిప‌డి, రూ. 3 కోట్ల విలువైన ఇల్లు, కోతకు గురైన బీచ్‌లో కొట్టుకుపోయింది. కేప్ హాటెరాస్ నేషనల్ సైన్స్ సీషోర్, నేషనల్ పార్క్ సర్వీస్ క్యాప్చర్ చేసిన ఈ దుర్ఘటన ట్విట్ట‌ర్‌లో షేర్ చేశారు. అదే రోజు కుప్పకూలిన ఇళ్ల‌ల్లో ఇది రెండోదిగా వారు పేర్కొన్నారు. అయితే, ఆ స‌మ‌యంలో ఇంట్లో ఎవ్వ‌రూ లేక‌పోవ‌డంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

ఇక‌, ఆ ప్రాంతంలో బీచ్ వాతావరణ ప‌ర్యావ‌ర‌ణ‌ మార్పుకు సాక్ష్యమ‌ని, దాని వ‌ల్ల‌ ప్రమాదకరమైన భారీ ఈదురుగాలులు, సముద్రం ఓవర్‌వాష్ అవ్వ‌డం ప్రజలకు ఒక హెచ్చ‌రిక అని కేప్ హాటెరాస్ నేషనల్ సీషోర్ గతంలో ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ప్రదేశం ముఖ్యంగా వేసవి కాలంలో పర్యాటకులకు ప్రసిద్ధి చెందింది. ఒక CNN నివేదిక ప్రకారం, నార్త్ కరోలినాలోని కేప్ హటెరాస్ సరిహద్దులో సముద్ర మట్టాలు, బీచ్ కోతలు పెరుగుతున్నట్లు పేర్కొన్నారు. ఇలాంటి ఘటనలు తరచూ చోటుచేసుకోవ‌డం వ‌ల్ల‌ రానున్న రోజుల్లో మరిన్ని ఇళ్లు కూలిపోయే ప్రమాదం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు ముందస్తు చర్యలు తీసుకుంటున్నారని, ఓషన్‌ డ్రైవ్‌తో పాటు ఇంటి యజమానులకు అవగాహన కల్పిస్తున్నామని అధికారులు చెబుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed