జర్మనీలో దారుణం.. బస్సులో ప్రయాణిస్తున్న వారిపై ఓ మహిళ కత్తితో దాడి..పలువురికి తీవ్ర గాయాలు

by Maddikunta Saikiran |
జర్మనీలో దారుణం.. బస్సులో ప్రయాణిస్తున్న వారిపై ఓ మహిళ కత్తితో దాడి..పలువురికి తీవ్ర గాయాలు
X

దిశ, వెబ్‌డెస్క్: జర్మనీలో దారుణమైన ఘటన చోటు చేసుకుంది. నార్త్ రైన్-వెస్ట్‌ఫాలియాలోని సీజెన్‌లోని బస్సులో శుక్రవారం సాయంత్రం హింసాత్మక సంఘటన జరిగింది. బస్సులో ప్రయాణిస్తున్న వారిపై ఓ మహిళ కత్తితో దాడి చేయడంతో ఐదుగురు గాయపడ్డారు.ఇందులో ముగ్గురు వ్యక్తులు ప్రాణాపాయ స్థితిలో ఉన్నారని పోలీసులు తెలిపారు. ఘటన జరిగిన సమయంలో బస్సులో దాదాపు 40 మంది ప్రయాణికులు ఉన్నారని పోలీసులు తెలిపారు. కాగా దాడి చేసిన మహిళను పోలీసులు వెంటనే అరెస్ట్ చేశారు. జర్మన్ వార్తాపత్రిక బిల్డ్ ప్రకారం, దాడి చేసిన మహిళ జర్మన్ జాతీయురాలని, కొన్ని రోజులుగా ఆమె మానసిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతుందని స్థానిక పోలీసులు తెలిపారు. డ్రగ్స్ ప్రభావంతోనే ఇలా దాడి చేసి ఉండొచ్చని అలాగే ఉగ్రవాదాన్ని ప్రేరేపించే విధంగా ఈ దాడి జరిగిందనే అనుమానం లేదని పోలీసులు స్పష్టం చేశారు. కాగా కొన్ని రోజుల క్రితం పశ్చిమ జర్మనీలోని సోలింగెన్ నగరంలో జరిగిన ఒక ఉత్సవంలో ఓ దుండగుడు కత్తితో దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఇద్దరు పురుషులు, ఓ మహిళ ప్రాణాలు కోల్పోయారు.అయితే దాడి చేసిన వ్యక్తి ISIS కు చెందిన ఉగ్రవాదిగా అక్కడి ప్రభుత్వం గుర్తించింది .

Advertisement

Next Story