- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
Ap News: అమరావతి అభివృద్ధికి మరో కీలక నిర్ణయం
దిశ, వెబ్ డెస్క్: అమరావతి రాజధానిని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఈ మేరకు వేగంగా ప్రణాళికలు రూపొందిస్తోంది. ఈ నెలాఖరులోపు టెండర్లు పిలవాలని నిర్ణయించింది. జనవరి నుంచి అమరావతి అభివృద్ధి పనులు ప్రారంభించాలని భావిస్తోంది. ప్రపంచ బ్యాంకు రుణం కోసం ఈ నెల 17, 18 తేదీల్లో ఢిల్లీలో అధికారికంగా ఒప్పందం చేసుకోనుంది. ఇప్పటికే రాజధాని మాస్టర్ ప్లాన్‌ను సిద్ధం చేసిన ప్రభుత్వం.. ఏ జోన్‌లో ఏ నిర్మాణం చేపట్టాలనే అంచనాకు సైతం వచ్చినట్లు తెలుస్తోంది. 12 జోన్లగా అమరావతి రాజధానిని అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకులు ఇచ్చే రుణాలను వినియోగించుకునేందుకు ప్రభుత్వం తాజాగా కీలక ఉత్తర్వుల జారీ చేసింది. రూ.15 వేల కోట్ల మేర రుణ సహకారాన్ని బ్యాంకులు అందిస్తున్నట్లు స్పష్టం చేసింది. అమరావతి అభివృద్ధికి ప్రణాళికలు అమలు చేయాలని ఈ మేరకు CRDAను ఆదేశించింది.