- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ధాన్యం కొనుగోలు చేయాలని రైతుల ధర్నా
దిశ, మిర్యాలగూడ : మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు చేయాలని రైతులు ఆందోళనకు దిగారు. వేములపల్లి మండలం శెట్టిపాలెం సమీపంలోని అద్దంకి -నార్కెట్పల్లి రహదారిపై ,మిర్యాలగూడ రూరల్ మండలం అవంతిపురం సమీపంలోని కోదాడ- జడ్చర్ల రహదారిపై ఆదివారం రైతులు రాస్తారోకో నిర్వహించారు. మిల్లర్లు సకాలంలో ధాన్యం కొనుగోలు చేయకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారని రైతులు ఆరోపించారు. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర కాకుండా తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల ఇబ్బందులు పడుతున్న అధికారులు పట్టించుకోవడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మిల్లర్లు సిండికేట్ గా మారి రైతులను ఇబ్బంది పెడుతున్నారని అన్నారు. ధాన్యం కొనుగోలు వేగవంతం చేయకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతున్నట్లు హెచ్చరించారు. దీంతో ప్రధాన రహదారులపై సుమారు మూడు కిలోమీటర్ల మేరకు వాహనాలు నిలిచిపోయి, రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడ్డాయి. మిర్యాలగూడ రూరల్ సీఐ వీరబాబు, ఎస్సైలు వెంకటేశ్వర్లు, లోకేష్, కృష్ణయ్య సంఘటన స్థలాలకు చేరుకొని.. రైతులకు సర్ది చెప్పి ట్రాఫిక్ ను నియంత్రించారు. పోలీసులు దగ్గరుండి మిల్లులకు ట్రాక్టర్లను పంపించి రైతులను శాంతింపజేశారు.