- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
నన్ను తీర్చిదిద్దింది సంఘమే
దిశ, నవీపేట్ : సామాన్య కుటుంబంలో పుట్టిన తనను తీర్చిదిద్దినది రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘమేనని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం కందకుర్తి లోని త్రివేణి సంగమం గోదావరిలో ఆదివారం నాడు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆర్ఎస్ఎస్ శతాబ్ది వేడుకలలో భాగంగా.. ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకులు డా.హెగ్డేవార్ పూర్వీకుల స్థలంలో 45 కోట్లతో నిర్మిస్తున్న కేశవరావు బలిరాం హెగ్డేవార్ స్ఫూర్తి కేంద్రం నిర్మాణ పనులను పరిశీలించి, ప్రసిద్ధ రామాలయంలో బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి తో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పచిన సమావేశంలో మాట్లాడుతూ..పేద కుటుంబంలో పుట్టిన తాను కేంద్ర మంత్రి గవర్నర్ గా ఎన్నిక కావడానికి కారణం సంఘమేనని,ఆర్ఎస్ఎస్ శాఖ సంస్కారం ఇచ్చిందని తెలిపారు. రాయిని శిల్పంగా మార్చింది సంఘమేనని,జీవితంలో సంస్కారం ,నైతిక విలువలు లేకుంటే మనిషి పతనమని,వ్యక్తి నిర్మాణం,సంఘ నిర్మాణంతోనే దేశం అభివృద్ధి చెందుతుందని అన్నారు. పీఎం మోడీ భారతదేశాన్ని ప్రపంచంలో 3వ అగ్రగామి దేశంగా తీర్చిదిద్దేనందుకు పని చేస్తున్నారని, భారత సాంస్కృతిని విశ్వవ్యాప్తం చేస్తున్నారని తెలిపారు. తాను ఇక్కడకు గవర్నర్ గా కాకుండా స్వయం సేవక్ గానే వచ్చానని,కందకుర్తిని పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడతానని హామీ ఇచ్చారు. గోదావరిని కలుషితం కాకుండా చర్యలు తీసుకోవలసిన బాధ్యత అందరిపై ఉందని అన్నారు. కార్తీక మాసంలో నది స్నానం ఎంతో పవిత్రమని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్ఫూర్తి కేంద్ర అధ్యక్షులు సుధాకర్ రెడ్డి, ఆర్ఎస్ఎస్ నాయకులు హన్మంత్ రావు, గోవింద్, రచ్చ తిరుపతి, రమేష్ గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.