- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సారూ...మా ఆకలి బాధలు తీర్చండి
దిశ, మణుగూరు : 22 నెలలుగా జీతాలు చెల్లించడం లేదని, తమను అన్ని విధాలుగా ఆదుకోవాలని పీఎంహెచ్ హాస్టల్ వర్కర్లు పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లును కోరారు. ఆదివారం ప్రజా భవన్ కార్యాలయంలో సీఐటీయూ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే పాయంకు వినతిపత్రం అందజేశారు. మా ఆకలి బాధలు తీర్చండని వేడుకున్నారు. గతంలో ధర్నాలు, పోరాటాలు నిర్వహించిన ఫలితంగా ఐటీడీఏ పీఓ రెండు విడతలుగా ఆరు నెలలు వేతనాలు చెల్లించారని, ఇంకా 16 నెలల వేతనాలు బకాయి ఉన్నాయని ఎమ్మెల్యేకు చెప్పారు.
తామంతా గిరిజనులమని, తమ కుటుంబాలను పస్తులుంచి హాస్టల్ లో వంట చేస్తున్నామని, అయినా మా బాధలు ప్రభుత్వానికి పట్టడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేగా తమరు జోక్యం చేసుకొని తమకు జీతాలు ఇప్పించాలని కోరారు. ఎమ్మెల్యే వెంటనే స్పందించి ఆర్థిక మంత్రితో మాట్లాడి మీ 22 నెలల జీతాలు వచ్చేలా చేస్తానని హామీ ఇచ్చారు. సీఐటీయూ మణుగూరు మండల నాయకులు సత్రపల్లి సాంబశివరావు, పోస్ట్ మెట్రిక్ హాస్టల్ అవుట్సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ నాయకులు స్వరూప, భద్రమ్మ, దుర్గ, ఆదిలక్ష్మి, సరోజిని పాల్గొన్నారు.