పాకిస్తాన్ కొత్త అధ్యక్షుడిగా ఆసిఫ్ అలీ జర్దారీ

by Hajipasha |   ( Updated:2024-03-09 14:26:49.0  )
పాకిస్తాన్ కొత్త అధ్యక్షుడిగా ఆసిఫ్ అలీ జర్దారీ
X

దిశ, నేషనల్ బ్యూరో : పాకిస్తాన్ 14వ అధ్యక్షుడిగా 68 ఏళ్ల ఆసిఫ్ అలీ జర్దారీ ఎన్నికయ్యారు. దేశ చరిత్రలో రెండుసార్లు అధ్యక్షుడిగా ఎన్నికైన తొలి పౌరుడు ఈయనే. అంతకుముందు జర్దారీ 2008 నుంచి 2013 సంవత్సరం వరకు అధ్యక్షుడిగా పనిచేశారు. దేశాధ్యక్షుడి ఎన్నికలో పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ), పాకిస్తాన్ ముస్లిం లీగ్-నవాజ్ (పీఎంఎల్ - ఎన్) నేతృత్వంలోని సంకీర్ణ కూటమి అభ్యర్థిగా పోటీచేసిన ఆసిఫ్ అలీ జర్దారీకి 255 ఓట్లు వచ్చాయి. ఇమ్రాన్ ఖాన్ మద్దతు కలిగిన సున్నీ ఇత్తెహాద్ కౌన్సిల్ అభ్యర్థి మహమూద్ ఖాన్ అచక్జాయ్ 119 ఓట్లను పొందారు. వాస్తవానికి ఆసిఫ్ అలీ జర్దారీ ఒక వ్యాపారవేత్త. పాకిస్తాన్ దివంగత మాజీ ప్రధానమంత్రి బెనజీర్ భుట్టో భర్తే ఈ ఆసిఫ్ అలీ జర్దారీ. ఇంతకుముందు వరకు పాక్ అధ్యక్షుడిగా వ్యవహరించిన డాక్టర్ ఆరిఫ్ అల్వీ పదవీకాలం వాస్తవానికి గతేడాదే ముగిసింది. దేశంలో కొత్త ఎలక్టోరల్ కాలేజీ ఏర్పాటు కానందున ఆయన అదనంగా ఏడాది పాటు పదవిలో కొనసాగారు.

Advertisement

Next Story

Most Viewed