- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
అమేజింగ్ వెడ్డింగ్ ఇన్విటేషన్.. చూస్తే షాకవ్వడం ఖాయం
దిశ, వెబ్‌డెస్క్: సాధారణంగా ఎవరైనా సరే పెళ్లికి వెళ్తే.. విలువైన బహుమతులు.. రిటర్న్ గిఫ్టుల హడావిడీ తప్పనిసరి. ఎంతటి వీఐపీలు అయినా ఏదో ఒక బహుమతి తీసుకుని వెళ్తారు. మరికొంతమంది కట్నం చదివిస్తారు. చాలా మందికి ఇక్కడి వరకే తెలుసు. కానీ యువజంట మా వివాహ వేడుకకు కట్నకానుకలేమి తీసుకురావద్దంటూ వెరైటీ వెడ్డింగ్ కార్డు డిజైన్ చేశారు. ‘‘వివాహానికి హాజరవుతున్న బంధు మిత్రుల నుంచి ఎటువంటి బహుమతులు తీసుకోమని.. బుద్ధి మాంద్యంతో బాధపడుతున్న చిన్నారులకు సేవలందిస్తున్న చారిటబుల్ ట్రస్ట్‌కు విరాళంగా ఇవ్వాలని ఆహ్వాన పత్రికలో ప్రచురించారు.
సదరు చారిటబుల్ ట్రస్ట్ సంస్థకు చెందిన స్కానర్‌ను కూడా వెడ్డింగ్ ఇన్విటేషన్‌లో పొందు పరిచారు. వివరాల్లోకెళ్తే.. యాయవరం వెంకట రమణ- జ్యోతి దంపతులు 20 ఏళ్లుగా అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో నివాసముంటున్నారు. వెంకట రమణ ఐటీ ప్రొఫెషనల్‌గా పని చేస్తున్నాడు. కాగా వీరు అంతర్జాతీయ సేవా సంస్థ హెచ్‌ఎస్‌ఎస్ సేవా కార్యక్రమాలలో పాల్గొంటున్నారు. అయితే వీరి పెద్ద కుమార్తె సమీరా.. బీటెక్ పూర్తి చేసి అమెరికాలోనే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నది. అదే రాష్ర్టానికి చెందిన తిరుపతయ్య నాగజ్యోతిల కుమారుడైన ఐటీ ఉద్యోగికి సమీరాను ఇచ్చి నిన్న (డిసెంబరు 22)వివాహం జరిపించారు.
కాగా పెళ్లి కుమార్తె తల్లిదండ్రులు.. ‘వివాహ వేడుకకు హాజరయ్యేవారు బహుమతులు తీసుకురావద్దు. వాటికి బదులుగా తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూరులో కొన్ని ఏళ్లుగా అభాగ్యులకు అండగా నిలుస్తూ, సేవలందిస్తున్న ‘ద అమేజ్ చారిటబుల్ ట్రస్ట్’ సంస్థకు విరాళం అందించండి.’ అని పెళ్లి పత్రికలో ప్రచురించారు. వారి కుమార్తెతో పాటు కాబోయే అల్లుడు కుటుంబ సభ్యుల మద్దతును కూడగట్టుకుని ఈ సేవా కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. ఈ తరహా సేవా కార్యక్రమాలు కొందరికైనా స్ఫూర్తిగా నిలవాలన్నదే తమ ఆలోచనని వెంకటరమణ-జ్యోతి తెలిపారు. కాగా బంధు మిత్రులు ఇప్పటికే సదరు స్కానర్ ఆధారంగా ‘ద అమేజ్ చారిటబుల్ ట్రస్ట్’ కు కొంత మేర విరాళాలు పంపినట్లు వెల్లడించారు.