Alberto Fujimori:పెరూ మాజీ అధ్యక్షుడు అల్బెర్టో ఫుజిమొరి కన్నుమూత

by Maddikunta Saikiran |
Alberto Fujimori:పెరూ మాజీ అధ్యక్షుడు అల్బెర్టో ఫుజిమొరి కన్నుమూత
X

దిశ, వెబ్‌డెస్క్:పెరూ(Peru) మాజీ అధ్యక్షుడు(former president) 86 ఏళ్ల అల్బెర్టో ఫుజిమొరి(Alberto Fujimori) కన్నుమూశారు. అల్బెర్టో గత కొంతకాలంగా క్యాన్సర్‌తో బాధ పడుతున్నారు.తన తండ్రి దీర్ఘ కాలంగా క్యాన్సర్‌తో పోరాడి మరణించారని,అందరికీ ధన్యవాదాలు అని ఆయన కుమార్తె కైకో ఫుజిమొరి(Keiko Fujimori) 'ఎక్స్‌'(X)లో ప్రకటించారు.

కాగా అల్బెర్టో ఫుజిమొరి పెరూ స్వాతంత్య్ర దినోత్సవం రోజు అనగా 1938 జూలై 28వ తేదీన రాజధాని లిమా( Lima)లో జన్మించారు. ఈయన కుటుంబం జపాన్‌(Japan) నుంచి పెరూకు వలస వచ్చింది. ఫుజిమోరి 1990 నుండి 2000 వరకు పెరూ దేశానికి అధ్యక్షుడిగా పని చేశారు. ఆయన హయాంలో తీసుకొచ్చిన సంస్కరణలు ఆ దేశ ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టగా అవే సంస్కరణలు ఆయన్ను చిక్కుల్లోకీ నెట్టాయి. వామపక్షాల సహకారంతో అధికారంలోకి వచ్చిన అయన, తిరుగుబాటుదారులపై తీవ్రమైన అణచివేతను అమలు చేశారు. చివరకు దేశం నుంచి పారిపోయే పరిస్థితి వచ్చింది. ఆ తరువాత జైలు పాలై.. క్యాన్సర్ బారిన పడ్డారు. పరిస్థితి విషమించడంతో 86 ఏళ్ల వయసులో మృతి చెందారు. అయితే 2026 అధ్యక్ష ఎన్నికల్లో మళ్లీ పోటీ చేయాలని తన తండ్రి భావిస్తున్నారంటూ కొన్ని నెలల క్రితం కైకో ప్రకటించడం గమనార్హం.కాగా ఫుజిమొరి మృతిపట్ల ఆ దేశ ప్రధాని(Prime Minister) గుస్తావో అడ్రియన్‌జెన్ (Gustavo Adrianzen) తన సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఫుజిమొరి మృతి చెందడం బాధాకరమని,ఆయన కుటంబ సభ్యులకు ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటదని ప్రధాని హామీ ఇచ్చారు.

Advertisement

Next Story

Most Viewed