- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Afghanistan: తూర్పు ఆఫ్ఘనిస్తాన్‌లో తీవ్ర విషాదం.. నది దాటుతుండగా పడవ బోల్తా, 20 మంది దుర్మరణం
X
దిశ, వెబ్‌డెస్క్: తూర్పు ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. శనివారం ఉదయం ఓ నదిని దాటుతుండగా.. పడవ బోల్తా పడిన 20 మంది దుర్మరణం పాలయ్యారు. వివరాల్లోకి వెళితే.. మహ్మంద్ దారా జిల్లాలో నదిని దాటుతుండగా బోటు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో బోటులో ఉన్న వారంతా కూడా మునిగిపోయారని నంగర్‌హర్ ప్రావిన్స్‌లోని సమాచార, సాంస్కృతిక శాఖ ప్రావిన్షియల్ డైరెక్టర్ ఖురేషీ బద్లోన్ తెలిపారు. మృతుల్లో మహిళలు, పిల్లలు కూడా ఉన్నారని తెలిపారు. ప్రమాదం జరిగిన సమయంలో బోటులో మొత్తం 25 మంది ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ ప్రమాదంలో కేవలం ఐదుగురు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారని అధికారులు తెలిపారు. మృతదేహాల వెలికతీతకు రెస్క్యూ టీం రంగంలోకి ఐదు మృతదేహాలను వెలికి తీశారు. మిగిలిన వారి కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.
Advertisement
Next Story