- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Ghost Wedding:విచిత్ర ఘటన..ప్రియుడి ఆత్మతో పెళ్లికి సిద్ధమైన యువతి..ఎక్కడంటే?
దిశ,వెబ్‌డెస్క్: తైవాన్‌లో విచిత్రమైన వివాహం జరుగనుంది. కారు ప్రమాదంలో చనిపోయిన తన ప్రియుడి ఆత్మను పెళ్లి చేసుకునేందుకు ‘యు’ అనే యువతి సిద్ధమైంది. ఈ నెల 15వ తేదీన జరిగిన కారు ప్రమాదంలో యు ముగ్గురిని కాపాడగా ప్రియుడిని రక్షించ లేకపోయింది. ఈ క్రమంలో అతడిని రక్షించ లేకపోయినందుకు ఆమె చాలా బాధపడింది. దీంతో అతడిపై ఉన్న ప్రేమ, అతని తల్లి ఒంటరైపోతుందని భావించిన యువతి అతని ఆత్మను వివాహం చేసుకోవాలని నిశ్చయించుకుంది. 'ఆత్మతో వివాహం' అనేది మొదటిసారి వింటున్నారు కావచ్చు కానీ ఈ సంప్రదాయం చైనాలో 3 వేల ఏండ్ల నాటి నుంచి ఉంటుందని చెబుతున్నారు.
ఈ సంప్రదాయం లో చనిపోయిన వారిని వివాహం చేసుకుంటారంట. ఇలా పెళ్లి చేసుకుంటే చనిపోయిన వారి ఆత్మ శాంతిస్తుందని అక్కడి ప్రజలు విశ్వసిస్తారు. ఈ వివాహంలో మరణించిన వ్యక్తి ఫొటో, బట్టలు, ఇతర వస్తువులను ఉపయోగిస్తారు. ఈ పురాతన సంప్రదాయం ప్రకారం ఈ అమ్మాయి తన ప్రేమికుడి ‘ప్రేత వివాహం’ చేసుకోవడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ప్రజెంట్ ‘యు’ అనే యువతి కథ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై చాలా మంది ఎమోషనల్ అయ్యారు. కాగా, ఈ ఘటనపై నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
Read More..
అఘాయిత్యానికి ప్రయత్నం.. మహిళ చేసిన పనికి పరుగు తీసిన యువకుడు