- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బద్దలైన అగ్నిపర్వతం.. 11 మంది మృతి
దిశ, డైనమిక్ బ్యూరో: ఇండోనేషియాలోని పశ్చిమ ప్రాంతంలో ఆదివారం ఓ అగ్నిపర్వతం బద్దలైంది. సుమత్రా దీవిలో మౌంట్ మరపిలో ఉన్న అగ్నిపర్వతం విస్ఫోటనం చెందింది. ఈ ఘటనలో 11 మంది పర్వతారోహకులు మృతి చెందినట్లు స్థానిక అధికారులు ఇవాళ గుర్తించారు. మరో 12 మంది ఆచూకీ గల్లంతైనట్లు వెల్లడించారు. అగ్నిపర్వతం విస్ఫోటనం చెందడంతో బూడిద ఆకాశంలో మూడు వేల మీటర్ల ఎత్తుకు వ్యాపించింది. దీంతో సమీపంలోని గ్రామాలపై అగ్ని పర్వత శిధిలాల వర్షం కురిసింది. మొత్తం 75 మంది పర్వతారోహణకు వెళ్లారని, వారిలో 11 మంది చనిపోగా.. 49 మందిని కాపాడినట్లు సెర్చ్ అండ్ రెస్క్యూ ఏజెన్సీ చీఫ్ అబ్దుల్ మాలిక్ మీడియాకు తెలిపారు. పర్వత ప్రాంతంలో రెస్క్యూ ఆపరేషన్ కష్టతరమైనదని, ఇవాళ కూడా పొగలు కమ్ముకునే ఉన్నాయని చెప్పారు. గల్లంతైన వారి ఆచూకీ కోసం ఆ ప్రాంతంలో తీవ్రంగా గాలిస్తున్నట్లు వెల్లడించారు. ఘటన తీవ్రత నేపథ్యంలో మౌంట్ మరపి ప్రాంతంలో అధికారులు అలర్ట్ ప్రకటించారు.