- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
BRS: ఏడాది పూర్తైన సందర్భంగా మాజీమంత్రి కేటీఆర్ ఆసక్తికర ట్వీట్
దిశ, వెబ్ డెస్క్: ఎంత గట్టిగా కొట్టగలమనేది కాదు.. ఎంత సాధించగలమనేదే ముఖ్యమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Working President KTR) ట్వీట్ చేశారు. బీఆర్ఎస్ పార్టీ(BRS party) అధికారం కోల్పోయి సంవత్సరం అయిన సందర్భంగా.. ట్విట్టర్ వేదికగా పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా.. "ఇది మీరు ఎంత గట్టిగా కొట్టగలరనే దాని గురించి కాదు.. ఎంత కష్టపడి సాధించగలరు అనే దాని గురించి అంటూ.. ఈ పోరాటాన్ని ఇలాగే కొనసాగించాలని అన్నారు. బీఆర్ఎస్ పార్టీకి గత సంవత్సరం అనేక ఒడిదుడుకులు, సవాళ్లతో నిండిన కష్టతరమైన సంవత్సరాలలో ఒకటి అని చెప్పారు. కానీ ఒక సంవత్సరం తర్వాత, ఇక్కడ మేము పోరాడుతున్నాము, మా తెలంగాణ ప్రజల కోసం నిలబడతాము అనేది నిరూపించారని అన్నారు. దీనికై ధైర్యంగా నిలిచిన మా అధ్యక్షుడు కేసీఆర్(KCR) నాయకత్వానికి, మా నాయకులకు, అట్టడుగు వర్గాల సైనికులకు, కార్యకర్తలకు(Activists) ధన్యవాదాలు తెలియజేశారు. అంతేగాక ఈ పోరాటంలో అద్భుతమైన పాత్ర పోషిస్తున్న ప్రపంచవ్యాప్తంగా ఉన్న సోషల్ మీడియా యోధులకు(Social Media Warriors) ప్రత్యేక ధన్యవాదాలు అని కేటీఆర్ రాసుకొచ్చారు.