క్యాన్స‌ర్‌తో బాధ‌ప‌డుతున్న‌ య‌జ‌మానిని చూసిన కుక్క ఏంచేసిందో చూడండి!

by Sumithra |   ( Updated:2023-03-30 16:23:09.0  )
క్యాన్స‌ర్‌తో బాధ‌ప‌డుతున్న‌ య‌జ‌మానిని చూసిన కుక్క ఏంచేసిందో చూడండి!
X

దిశ‌, వెబ్‌డెస్క్ః కుక్కలు నిజంగా మనిషికి ఎంత‌ మంచి నేస్తాలో ఇంటర్నెట్‌లో చాలా వైరల్ వీడియోలు నిరూపిస్తాయి. నిజానికి, కొన్ని సంవ‌త్స‌రాలు ఇంట‌ర్నెట్‌లో అత్యంత ఎక్కువ‌గా వ్యాప్తిలో ఉన్న వైర‌ల్ వీడియోలు కూడా కుక్క‌ల‌వే కావ‌డం విశేషం. ఇక‌, ఇటీవలి ఓ వైరల్ వీడియో కూడా సోష‌ల్ మీడియాలో అంద‌ర్నీ కంట‌త‌డి పెట్టిస్తోంది. క్యాన్స‌ర్‌తో బాధ‌ప‌డుతున్న మ‌రియా అనే మ‌హిళ‌ 40 రోజులుగా ఆసుప‌త్రిలో ఉండి వైద్యం చేయించుకుంటూ త‌న పెంపుడు కుక్క అమోరాను చూడ‌కుండా ఉంటుంది. అన్ని రోజుల త‌ర్వాత అమోరాను త‌న య‌జ‌మాని ద‌గ్గ‌ర‌కు తీసుకువ‌స్తారు బంధువులు. జుట్టంతా తీసేసి, రోగిలా మారిన త‌న య‌జ‌మాని మ‌రియా ఎత్తుకోగానే అమోరా చాలా ఉత్సాహంగా, ఎంతో ప్రేమ‌తో మ‌రియాను హ‌త్తుకుంటుంది. గంతులు వేస్తూ త‌న మ‌రియా ముఖాన్ని త‌డుముతుంది. ఎంతో సంతోషంతో మ‌రియాపై ముద్దులు కురుపిస్తుంది. అమోరా త‌న భాష‌లో త‌న య‌జ‌మానిని ప‌ల‌కరించే ఈ తీరు అంద‌ర్నీ చ‌లింప‌జేస్తుంది. ఎంతో ఎమోష‌న‌ల్‌గా ఉన్న ఈ వీడియో గుడ్‌న్యూస్‌క‌ర‌స్పాండెన్స్ అనే ఇన్‌స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేయ‌గా వైర‌ల్ అయ్యింది. కళ్లు చ‌మ‌ర్చుతుంటే చాలా మంది వీడియోను క‌న్నార్ప‌కుండా చూస్తున్నారు. మ‌న‌సుతో కామెంట్ చేస్తూ భారంగా ఆనందిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed