ఉగ్రదాడిలో పాక్ గూఢచారి హతం.. ఏడుగురికి గాయాలు

by Shiva |
ఉగ్రదాడిలో పాక్ గూఢచారి హతం.. ఏడుగురికి గాయాలు
X

దిశ, వెబ్ డెస్క్: వాయవ్య పాకిస్థాన్ లో మంగళవారం ఉగ్రవాదులతో జరిగిన ఎదురు కాల్పుల్లో పాక్ ఇంటెలిజెన్స్ అధికారి మృతి చెందారు. ఆయన బృందంలోని ఏడుగురు గాయపడ్డారని ఆ దేశ సైన్యం తెలిపింది. ఆఫ్ఘనిస్థాన్ సరిహద్దుల్లోని పర్వత ప్రాంతం, ఇస్లామిక్ తీవ్రవాదులకు చాలాకాలంగా కేంద్రంగా ఉన్న దక్షిణ వజీరిస్థాన్ లో జరిగిన ఎన్ కౌంటర్ లో పాకిస్థాన్ దేశ ప్రధాన గూఢచారి సంస్థ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ కు చెందిన బ్రిగేడియర్ ముస్తఫా కమల్ బార్కీ హతమయ్యాడు. మిలిటెంట్లతో ఎదురుకాల్పులు జరిగాయని, బార్కీ బృందంలోని ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని మిలటరీ మీడియా విభాగమైన ఇంటర్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ పాకిస్థాన్ ఒక ప్రకటనలో తెలిపింది. జరిగిన ఈ ఘాతుకానికి ఏ గ్రూపు కూడా బాధ్యత వహించలేదు.

Advertisement

Next Story