- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కార్డ్‌బోర్డ్‌తో ప్రాణాలు రక్షించాడు! సూపర్ ఐడియా..?!
దిశ, వెబ్‌డెస్క్ః జంతువులు ప్రమాదకర పరిస్థితుల్లో ఉంటే జంతు ప్రేమికులకే కాదు, ప్రతిఒక్కరికీ జాలి కలుగుతుంది. నెట్టింట్లో ఎన్నో వీడియోలు వీటికి సంబంధించి మనం చూసే ఉంటాము. ప్రమాదంలో ఇరుక్కుపోయిన జంతువులు, వాటిని కాపాడిన హీరోల గురించి చూసి హమ్మయ్యా అనుకుంటాము. అయితే, ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఇంకాస్త స్పెషల్ ఉంది. కాలువలో ఇరుక్కున్న చిన్న పిల్లిని కాపాడటానికి ఈ యువకుడు సరికొత్త ప్లాన్‌తో ముందుకొచ్చాడు.
గుడ్ న్యూస్ మూవ్‌మెంట్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన వీడియోలో, ఒక వ్యక్తి కార్డ్‌బోర్డ్ పెట్టె ఉపయోగించి పిల్లిని రక్షించడం చూడొచ్చు. ఒక చిన్న పిల్లి పిల్ల కాలువ ఒడ్డుపైన భయంతో కూర్చోగా, ఒక అట్ట పెట్టెను కాలువ మీద వంతెన నుండి దించి, పిల్లి ఎక్కడానికి అనువుగా ఉంచుతాడు. అప్పటి వరకూ భయపడిని పిల్లి ఆ పెట్టెను కొన్ని క్షణాలు చూసి, ఆ పెట్టె ఎందుకు వచ్చిందో ఇట్టే పసిగడుతుంది. నెమ్మదిగా పెట్టెలో ఎక్కి కూర్చుంటుంది. ఆ వ్యక్తి దానిలో పిల్లిని పైకి లాగి కాపాడతాడు. సరికొత్త ఆలోచనతో పాటు, మానవత్వం ఉట్టిపడే ఈ వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. 'స్మార్ట్ మ్యాన్ స్మార్ట్ కిట్టి' అంటూ నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.