Donald Trump :అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై కేసు నమోదు

by GSrikanth |   ( Updated:2023-06-09 06:07:16.0  )
Donald Trump :అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై కేసు నమోదు
X

దిశ, డైనమిక్ బ్యూరో: 'పోర్న్ స్టార్' కేసులో ఇప్పటికే అభియోగాలు ఎదుర్కొంటున్న అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్‌కు తాజాగా మరో షాక్​ తగిలింది. రహస్య పత్రాల కేసులో తనపై ఫెడరల్ అభియోగాలు మోపినట్టు స్వయంగా ట్రంప్​ వెల్లడించారు. జూన్ 13న మియామిలోని ఫెడరల్ కోర్టు హౌస్ లో హాజరుకావాలని ఆయనకు సమన్లు ఇచ్చినట్లు తెలిపారు. 2024 అధ్యక్ష ఎన్నికల రేసులో రిపబ్లికెన్​ పార్టీ తరఫున ప్రధాన అభ్యర్థిగా దూసుకెళుతున్న తరుణంలో క్రిమినల్​ కేసులు ట్రంప్​ను వెంటాడుతుండటం సర్వత్రా చర్చలకు దారితీసింది.

అయితే, 2021లో అధ్యక్ష పదవి నుంచి దిగిపోయిన తర్వాత ట్రంప్ ప్రభుత్వానికి చెందిన వందలాది కీలక పత్రాలను ఫ్లోరిడాలోని తన మార్ ఎ లాగో ఎస్టేట్ కు తరలించినట్లు ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. గ‌త ఆగ‌స్టులో ఆ దేశానికి చెందిన న్యాయ‌శాఖ, మాజీ అధ్య‌క్షుడి ఇంట్లో సోదాలు చేసి దాదాపు 11 వేల డాక్యుమెంట్ల‌ను సీజ్ చేసిన విష‌యం తెలిసిందే. ఆ సీజ్ చేసిన ప‌త్రాల్లో దాదాపు వంద వ‌ర‌కు క్లాసిఫైడ్ కాగా, మ‌రికొన్ని టాప్ సీక్రెట్ ప‌త్రాలు ఉన్నాయి. అధ్య‌క్ష బాధ్య‌త‌ల నుంచి వైదొలిగిన త‌ర్వాత క్లాసిఫైడ్ డాక్యుమెంట్ల‌ను ఇంట్లో పెట్టుకోవ‌డం చ‌ట్ట‌రీత్యా నేరం. ఆ డాక్యుమెంట్ల‌లో ఎటువంటి స‌మాచారం ఉన్నా.. భ‌ద్ర‌త లేని ప్ర‌దేశాల్లో ఆ డాక్యుమెంట్లు ఉండ‌రాదు.

జాక్ స్మిత్ నేతృత్వంలోని బృందం ఈ కేసును విచారించింది. మొత్తం ఏడు అభియోగాల‌ను ట్రంప్‌పై న‌మోదు చేశారు. న్యాయాన్ని అడ్డుకోవ‌డం, కుట్ర‌, అక్ర‌మ‌రీతిలో క్లాసిఫైడ్ స‌మాచారాన్ని ద‌గ్గ‌ర పెట్టుకోవ‌డం లాంటి నేరాభియోగాలు ట్రంప్‌పై న‌మోదు అయ్యాయి. మంగ‌ళ‌వారం రోజున మియామి కోర్టులో ట్రంప్ హాజ‌రుకావాల్సి ఉంది. అయితే ఆ కేసులో ట్రంప్ హాజ‌రుకానున్న‌ట్లు ఆయ‌న త‌ర‌పున న్యాయ‌వాది వెల్ల‌డించారు. త‌న‌పై నేరాభియోగం మోపిన‌ట్లు ట్రంప్ త‌న‌కు చెందిన ట్రుత్ సోష‌ల్ అనే సోష‌ల్ మీడియాలో ప్ర‌క‌టించారు. 4 నిమిషాల వీడియోను ట్రంప్ పోస్టు చేశారు. త‌న‌ను తాను డిఫెండ్ చేసుకున్నారు. ఆయన అమాయ‌కుడినని, కుట్రపూరితంగానే అభియోగాలు మోపినట్లు ఆ వీడియోలో చెప్పుకొచ్చారు. ఎన్నికల్లో తనను అడ్డుకునేందుకు డెమోక్రాట్లు చేస్తున్న కుట్రగా ఆరోపించారు.

Read more:

ఆడపిల్లలను కన్నవారికి కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్

Advertisement

Next Story

Most Viewed