- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
బయటపడిన 200 ఏళ్ల నాటి సీసా.. అందులో ఏముందో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

దిశ, వెబ్ డెస్క్: పురావస్తు శాఖ తవ్వకాల్లో అనేక రకాలైన వస్తువులు బయటపడుతుంటాయి. అందులో కొన్ని నాటి చరిత్రను తెలియజేస్తే, మరికొన్ని అప్పటి వారి నమ్మకాలను, ఆచారాలను తెలియజేస్తుంటాయి. అలాంటి విషయం ఇప్పుడు తెలియటంతో అంతా ఆశ్చర్యానికి గురవుతున్నారు. గతేడాది ఇంగ్లండ్‌లోని క్లితోర్పేస్‌లో ఓ భవనాన్ని నిర్మించే కార్మికులకు దాదాపు 200 ఏళ్ల నాటి సీసా దొరికిన సంగతి తెలిసిందే. తాజాగా అందులో ఉన్న ద్రవం మిస్టరీ వీడింది.
సీ వ్యూ ప్రాంతంలో భవనాన్ని నిర్మించేందుకు కార్మికులు గుంతలు తవ్వుతుండగా ఓ పాత సీసా బయటపడింది. అందులో ఉన్న ద్రవాన్ని చూసి వారు మద్యం అనుకొని తాగబోయారు. అయితే, విషయం తెలుసుకున్న భవన నిర్మాణ ప్రాజెక్ట్ మేనేజర్ వారిని ఆపి ఆ సీసాను యూనివర్సిటీ ఆఫ్ లింకన్ ల్యాబ్‌కు పంపించారు. ఎన్నో పరిశోధనల తర్వాత 200 ఏళ్ల నాటి సీసాలో ఉన్నది మూత్రంగా యూనివర్సిటీ పరిశోధకులు తెలిపారు.
అలాగే ఆ సీసాను 1840 కంటే ముందు తయారీ చేశారని, సీసా ఆకారాన్ని బట్టి అది పూర్తిగా చేతితో చేసినట్లు గుర్తించారు. ఇక చివరికి, అందులో ఉన్నవి శరీర ద్రవాలని, అందులోనూ ప్రధానంగా మూత్రం అని తేల్చారు. పూర్వం 'దుష్ట శక్తులు' ప్రవేశించకుండా ఉండడానికి ఇంటి లోపల ఇలాంటి సీసాలను పాతిపెట్టేవారని యూనివర్సిటీ ఆఫ్ లింకన్ పరిశోధకులు వివరించారు. ఇంత పురాతన సీసా చెక్కు చెదరకుండా ఉండడం చాలా అరుదని, తమ దగ్గరికి పరిశీలన కోసం సహజంగా పింగాణీ వస్తువులు, వస్త్రాలు వస్తూ ఉంటాయని, గాజు సీసాలు అరుదని వివరించారు.