- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
24 గంటల్లోనే 90 మంది పాలస్తీనియన్లు మృతి: గాజా మంత్రిత్వ శాఖ వెల్లడి
by samatah |
X
దిశ, నేషనల్ బ్యూరో: ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం మరింత తీవ్రమవుతోంది. ఇజ్రాయెల్ దాడుల్లో గత 24 గంటల్లోనే 90 మంది పాలస్తీనియన్లు మృతి చెందగా..164 మంది గాయపడ్డట్టు గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ సోమవారం వెల్లడించింది. దీంతో యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 29,782కి చేరినట్టు తెలిపింది. అంతేగాక 70,043 మంది క్షతగాత్రులు కాగా.. అనేక మంది ప్రజలు నిరాశ్రయులయ్యారని తెలిపింది. అనేక మంది ఆశ్రయిం పొందుతున్న రఫా నగరంపై ఇజ్రాయెల్ దాడులు చేస్తున్న విషయం తెలిసిందే. మరోవైపు పాలస్తీనా ప్రధాని మహ్మద్ సతాయే సహా మొత్తం ప్రభుత్వం రాజీనామా చేసినట్టు తెలుస్తోంది. పాలస్తీనాలో కొత్త రాజకీయ నిర్మాణాన్ని రూపొందించాలని అమెరికా సూచన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. అయితే దీనిపై అధికారిక ప్రకటన వెలువడలేదు.
Advertisement
Next Story