2022లో 6,000 ఈఫిల్ టవర్‌లకు సమానమైన బరువు కలిగిన ఎలక్ట్రానిక్ వేస్ట్ ఉత్పత్తి

by Harish |
2022లో 6,000 ఈఫిల్ టవర్‌లకు సమానమైన బరువు కలిగిన ఎలక్ట్రానిక్ వేస్ట్ ఉత్పత్తి
X

దిశ, నేషనల్ బ్యూరో: ఎలక్ట్రానిక్ గాడ్జెట్‌ల కారణంగా ప్రపంచవ్యాప్తంగా 2022లో 62 మిలియన్ టన్నుల ఎలక్ట్రానిక్స్ వేస్ట్(ఈ-వేస్ట్) ఉత్పత్తి అయిందని ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్స్ యూనియన్ (ITU), యునైటెడ్ నేషన్స్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ (UNITAR) నుండి వచ్చిన నివేదిక పేర్కొంది. ఇది దాదాపు 6,000 ఈఫిల్ టవర్‌లకు సమానమైన బరువు కలిగి ఉంటుంది, లేదా 40 టన్నుల కలిగిన 1.55 మిలియన్ ట్రక్కులతో భూమధ్యరేఖను చుట్టుముట్టడానికి సమానం. ప్రపంచంలోని వ్యర్థాలు ప్రతి సంవత్సరం 2.6 మిలియన్ టన్నులు పెరుగుతోందని, 2030 నాటికి 82 మిలియన్ టన్నులకు చేరుకోవచ్చని అంచనా వేసింది. 2022లో ఉత్పత్తి అయిన 62 మిలియన్ టన్నుల ఈ-వేస్ట్‌లో నాలుగింట ఒక వంతు కంటే తక్కువ రీసైకిల్ చేయబడిందని, దీంతో భారీ లోహాలు, ప్లాస్టిక్‌లు, విష రసాయనాలు, ఈ వేస్ట్ నుంచి లీక్ అవుతున్నాయని నివేదిక తెలిపింది.

వీటిలో ఎక్కువ భాగం ఈ-సిగిరెట్లు, టాబ్లెట్‌లు, ఎలక్ట్రిక్ టూత్ బ్రష్‌లు, టోస్టర్‌లు వంటి గృహోపకరణాలు వంటి ఉన్నాయి. ఈ-వేస్ట్ రీసైక్లింగ్‌కు సరైన ప్రమాణాలు లేని కారణంగా ప్రస్తుతం $91 బిలియన్ల విలువైన లోహాలను వృధా చేస్తున్నామని డేటా పేర్కొంది. 2030 నాటికి దేశాలు ఈ-వ్యర్థాల సేకరణ, రీసైక్లింగ్ రేట్లను 60 శాతానికి తీసుకురాగలిగితే, మానవ ఆరోగ్య ప్రమాణాలు చాలా వరకు మెరుగవుతాయని, ఈ-వేస్ట్ పర్యావరణానికి పెద్ద విపత్తు, దీని కట్టడికి ప్రపంచ దేశాలు కఠిన నిబంధనలు తీసుకురావాలని నివేదికలో తెలిపారు.

Advertisement

Next Story