ఇజ్రాయెల్- లెబనాన్ సరిహద్దుల్లో 600 మంది భారతీయ సైనికులను మోహరింపు

by Y. Venkata Narasimha Reddy |
ఇజ్రాయెల్- లెబనాన్ సరిహద్దుల్లో 600 మంది భారతీయ సైనికులను మోహరింపు
X

దిశ, వెబ్ డెస్క్ : ఇజ్రాయెల్- లెబనాన్ హెజ్ బొల్లా మిలిటెంట్ సంస్థ మధ్య యుద్ధంతో పశ్చిమ ఆసియాలో నెలకొన్న సంక్షోభం ముదిరిపోతున్న క్రమంలో ఇజ్రాయెల్- లెబనాన్ సరిహద్దుల్లో 600 మంది భారతీయ సైనికులను మోహరించినట్లు సెంటర్ ఫర్ జాయింట్ వార్ఫేర్ స్టడీస్ మాజీ డైరెక్టర్ జనరల్ మేనేజర్ అశోక్ కుమార్ పేర్కొన్నారు. ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షణలో భాగంగా ఈ చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. 'ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షణలో భాగంగా ఇజ్రాయెల్- లెబనాన్ సరిహద్దుల్లో 120 కి.మీ.ల బ్లూలైన్ వెంబడి 600 మంది భారతీయ సైనికులను మోహరించారు. ఇజ్రాయెల్- లెబనాన్ మధ్య వివాదం పెరగకుండా నిరోధించడానికి ఐక్యరాజ్యసమితి శాంతి దళాలు పని చేస్తాయి. భారత సైనికులు అత్యంత సున్నితమైన ఈ ప్రాంతంలో యూఎన్ సిబ్బంది, శాంతి పరిరక్షక కార్యకలాపాలను రక్షించడం.. అలాగే సరిహద్దు వెంబడి హింస చెలరేగకుండా నిరోధించడం వారి ప్రాథమిక లక్ష్యం. కాగా మన సైనికుల భద్రత చాలా ముఖ్యమైనప్పటికి, ఆ ప్రాంతం నుంచి మన సైన్యాన్ని వెనక్కి తీసుకోవడంపై భారత్ ఏకపక్షంగా నిర్ణయం తీసుకోలేదని, కానీ, వారి శ్రేయస్సును తెలుసుకునేందుకు వారితో నిరంతరం సంప్రదింపులు జరుపుతూనే ఉంటుందని అశోక్ కుమార్ వెల్లడించారు.

మరోవైపు హెజ్ బొల్లా మద్దతుగా ఇజ్రాయెల్ లకు వ్యతిరేకంగా ఇరాన్ సైనిక చర్యకు సిద్దపడుతున్న నేపథ్యంలో పశ్చిమ ఆసియాలో భారత్ దౌత్య విధానం సంక్లిష్టంగా మారింది. ఇజ్రాయెల్ తో భారత్ మిత్ర బంధాన్ని కొనసాగిస్తునే చమురు అవసరాల నేపధ్యంలో ఇతర పశ్చిమ ఆసియా దేశాలతో విభేధాలు తలెత్తకుండా చాకచక్యంగా వ్యవహరించాల్సి ఉంది. భారత్ చమురు సరఫరా ప్రాజెక్టులలో చబహార్ పోర్టుకు ఇరాన్ కీలకంగా ఉండటంతో ఈ యుద్ధం కారణంగా చమురు సరఫరాకు అంతరాయం ఏర్పడితే అది నేరుగా భారత్ ఆర్థికవృద్ధిని ప్రభావితం చేస్తుందని అశోక్ కుమార్ అభిప్రాయపడ్డారు. పరిస్థితి మరింత క్షీణిస్తే గల్ఫ్ దేశాల్లో పనిచేస్తున్న 9 మిలియన్ల మంది భారతీయుల శ్రేయస్సు ప్రమాదంలో పడుతుందని ఆయన హెచ్చరించారు. అయితే కొంతమేర రష్యా నుంచి చముర సహా ఇతర వనరుల నుంచి దిగుమతులతో ఆయా సమస్యలకు కొంత ప్రత్యా్మ్నాయం ఉంది.

Next Story

Most Viewed