ఉగ్రదాడిలో 60 మంది మృతి.. ప్రధాని మోడీ దిగ్భ్రాంతి

by GSrikanth |
ఉగ్రదాడిలో 60 మంది మృతి.. ప్రధాని మోడీ దిగ్భ్రాంతి
X

దిశ, వెబ్‌డెస్క్: రష్యా రాజధాని మాస్కోలో ఘోరం జరిగింది. ఉగ్రవాదుల దాడిలో దాదాపు 60 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మాస్కోలోని క్రాకస్ సిటీ కన్సర్ట్ హాల్‌లో మ్యూజిక్ ఫెస్ట్ నిర్వహించారు. దీనికి వందల సంఖ్యలో సంగీత ప్రియులు హాజరయ్యారు. అయితే, ఈ హాల్‌లో మ్యూజిక్ లవర్స్‌గా ఎంట్రీ ఇచ్చిన ఉగ్రవాదులు ఒక్కసారిగా తుపాకులతో భయంకరంగా కాల్పులు జరిపారు. అక్కడికక్కడే 60 మంది మృతిచెందగా.. 100 మంది వరకు గాయాల పాలైనట్లు తెలుస్తోంది. తాజాగా.. ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రష్యాకు అండగా ఉంటామని ప్రకటించారు. అంతేకాదు.. ఈ దాడిని అమెరికాతో పాటు ఐక్యరాజ్య సమితి సభ్యదేశాలన్నీ ఖండించాయి. ప్రస్తుతం ఈ దాడికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. మరోవైపు ఈ దాడి తామే చేసినట్లు ఇస్లామిక్ స్టేట్ ప్రకటించుకున్నది. గత రెండు దశాబ్దాల్లో రష్యాల్లో ఇదే అతిపెద్ద ఉగ్రదాడిగా భావిస్తున్నారు.

Advertisement

Next Story